ఆల్ఫోన్సా విద్యా సంస్థలో బాలికలకు లైంగిక వేధింపులు

ఆల్ఫోన్సా విద్యా సంస్థలో బాలికలకు లైంగిక వేధింపులు

దేవాలయం లాంటి విద్యా సంస్థల్లో విద్యార్థినిలను వేధిస్తున్నారు. పిల్లలను కన్న బిడ్డల్లాగా చూడాల్సిన టీచర్లకు కామపు పొర ఆవరించింది. దీంతో మైనర్లని కూడా చూడకుండా తాను పనిచేసే పాఠశాలలో చదువుకునే చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు.

రాష్ట్ర రాజధానిలోని ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యార్థినిలకు భద్రత కరువైంది. లైంగిక వేధింపుల గురించి ప్రశ్నిస్తే ఆపాఠశాల నుంచి బలవంతంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. కూకట్‌పల్లి సెయింట్‌ ఆల్ఫోన్సా విద్యాసంస్థ వేధింపులు బయటపడ్డాయి. వేధింపులు తట్టుకోలేక కొంతమంది విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. స్కూల్‌ యాజమాన్యం నిర్వాకంతో తాజాగా మరో విద్యార్థిని చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సెయింట్‌ ఆల్ఫోన్సా విద్యాసంస్థలో తొమ్మిదో తరగతి పూర్తి ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి చదవాల్సి ఉంది. స్కూలు యాజమాన్యం వేధింపుల భరించలేక గతేడాది నవంబర్‌ 27 న చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటికి విద్యార్థి తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. కమిటి మెంబర్లు విచారించి కలెక్టర్‌కు స్కూల్‌పై ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల లీగల్‌ సర్వీస్‌ ఏప్రిల్‌ 10న కేసు నమోదు చేసింది. కమిటి విచారణను జూన్‌ 1 నుంచి ప్రారంభించనున్నట్లు హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్ అసోసియేషన్‌ తెలిపింది.

ఇదిలా ఉండగా స్కూలు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థి ప్రవర్తనతో సహ విద్యార్థులు నష్టపోతున్నారని, పేరెంట్స్‌ ప్రవర్తన కూడా సరిగా లేదని తెలుపుతూ ఈ స్కూల్లో పదో తరగతి చదివేందుకు అనుమతించడం లేదంటూ పోస్టులో టీసీ పంపించారు. ఇలాంటి పాఠశాలలను ఆగడాలను అరికట్టాలని మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌కు హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్ అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన టీసీని స్కూలు వెనక్కు తీసుకొని, పదో తరగతి చదివేందుకు అవకాశం కల్పించాలని ఫిర్యాదులో పేర్కొంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *