భాగ్యనగరంలో కలకలం..బయటపడ్డ సెక్స్ డ్రగ్స్‌ ఫ్యాక్టరీ

భాగ్యనగరంలో కలకలం..బయటపడ్డ సెక్స్ డ్రగ్స్‌ ఫ్యాక్టరీ

మహానగరంలో మరో కలకలం రేగింది. మరీ ముఖ్యంగా ఆడవారిని కలవరపెట్టే దారుణమొకటి వెలుగు చూసింది. అధికారుల కళ్లుగప్పి.. ఏకంగా నగరంలోనే అక్రమంగా కెటమైన్ అనే డ్రగ్‌ తయారు చేస్తున్న ఓ ల్యాబ్ గుట్టురట్టైంది. నాచారంలోని ఇంతం ల్యాబ్‌లో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు చేసిన సోదాల్లో ఒళ్లు గగుర్పుడిచే వాస్తవాలు వెలుగుచూశాయి.

కెమికల్స్ తయారీకి అనుమతి తీసుకున్న ఇంతం ల్యాబ్‌.. అక్రమంగా కెటమైన్ డ్రగ్‌ని తయారు చేస్తున్నట్టు తేలింది. కెటమైన్ అనేది అత్యంత ప్రమాదకరమైన డ్రగ్‌. లైంగికంగా రెచ్చగొట్టే గుణమున్న ఈ డ్రగ్‌ని తీసుకుంటే.. ఆయా వ్యక్తుల్లో కామోద్రేకం కట్టలు తెంచుకుంటుంది. ఐదారు గంటల పాటు ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోకి వెళ్తారు. నీళ్లు, కూల్‌ డ్రింక్స్, ఏ ఆహార పదార్థాల్లో అయినా ఈ డ్రగ్‌ని కలిపి ఇవ్వొచ్చు. అలా కలిపిన విషయాన్ని కూడా ఎవరూ గుర్తు పట్టలేరు. అంటే ఎక్కడైనా, ఎవరైనా ఈ డ్రగ్‌ని తీసుకునేలా చేయొచ్చు. వారిని లోబరుచుకోవచ్చు.

ఇంతం ల్యాబ్ ఓనర్ వెంకటేష్ ఐదేళ్లుగా కెటమైన్‌ డ్రగ్‌ తయారు చేస్తున్నట్టు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే ఇన్నాళ్లుగా ఎంత మంది వీటిని కొనుగోలు చేసి ఉంటారు.. ఎవరిపై ప్రయోగించి ఉంటారు.. ఎలాంటి అఘాయిత్యాలకు తెగబడి ఉంటారు? అన్న ప్రశ్నలు పోలీసుల్ని సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణంగా గోవా, ముంబై, బెంగళూరు వంటి నగరాల నుంచి.. దొంగచాటుగా డ్రగ్స్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో సప్లై చేసే ముఠాలు అనేకం ఉన్నాయి. కానీ నగరంలోనే డ్రగ్స్ తయారుచేసే ఓ కంపెనీ ఉండటం.. నివ్వెరపోయేలా చేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *