సీత 'రివ్యూ'

సీత 'రివ్యూ'

గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా… శ్రీనివాస్ కెరీర్ కు కీలకం కానుంది. మరి ఈ సినిమా తో బెల్లంకొండ హిట్ అందుకున్నాడో లేదో చూద్దాం.

Kajal Aggarwal Sita Trailer release

చాలా కాలం తర్వాత హిట్ అందుకున్న తేజ, సక్సస్ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి చేసిన సినిమా సీత… ఈ సినిమా కథాకథనాల విషయానికి వస్తే, సీత ఒక కన్స్ట్రుక్షన్ కంపెనీ ని నడుపుతున్న సమయంలో, ఒక స్లం ఏరియాలో ఇళ్ళు ఖాళీ చేయించడానికి ఎమ్మెల్యే బసవరాజ్ సాయం తీసుకుంటుంది. దానికి గాను కాజల్ తనతో పాటు నెల రోజులు కలిసి ఉండాలి అని కండీషన్ పెడతాడు బసవరాజ్. ముందు ఒప్పుకొని పని పూర్తి కాగానే కాజల్ మొహం చాటేస్తుంది. అందుకు హర్ట్ అయినా బసవ… సీతని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, ఇలాంటి కష్ట కాలంలో సీతని కాపాడడానికి ఆమె బావ రామ్ వస్తాడు. మరి సీత ని కాపాడాడా? చివరికి ఏం అయింది? అనేది ఈ సినిమా కథ.

ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. అందువలన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ బాగా బోర్ అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఓవర్ సెంటిమెంట్ ఆడియన్స్ కి ఎక్కలేదు. పైగా కథనం కూడా కొంచెం స్లో అవడంతో ప్రేక్షకుల పేషన్స్ నశిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే… సీత సినిమాలో కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్, సోనూ సూద్… ముగ్గురూ తన నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా బాగా చేశారు కానీ తేజ… వారి నటనకి సరిపోయే కథని అందించలేకపోయాడు. హిట్ ట్రాక్ ఎక్కిన తేజ, సీత కొత్తగా తీస్తాడు అనుకుంటే ఈ సినిమా కూడా చాలా రొటీన్ గా ఉంది. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో తేజ సక్సెస్ కాలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, క్వాలిటీలో ఎక్కడ రాజీపడలేదు కానీ కంటెంట్ విషయంలోనే బాగా నీరుత్సాహ పరిచారు. మ్యూజిక్ సోసోగానే ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్గా ‘సీత’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *