కొడుకు చేసిన 'పని'..నడిరోడ్డుపైనె శిక్ష వేసిన తల్లి

కొడుకు చేసిన 'పని'..నడిరోడ్డుపైనె శిక్ష వేసిన తల్లి

స్కూల్‌లో తోటి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుక్కి కఠిన శిక్ష వేసిందో తల్లి. అమ్మాయిని తాకకూడని చోట తాకాడని.. నడిరోడ్డుమీద అందరూ చూస్తుండగా ఆ శిక్షను అమలు చేసింది. క్రమశిక్షణ అంటే ఏంటో కొడుక్కి తెలిసేలా చేసింది.. ఈ ఘటన చైనాలో జరిగింది.

చైనాలోని గుయ్‌జో ప్రావిన్స్‌లో ఉన్నటువంటి ఓ స్కూల్‌ విద్యార్థి.. తన తోటి విద్యార్థినిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. క్లాస్‌లో ఆమెను ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాడు. దీంతో, ఈ విషయాన్ని క్లాస్ టీచర్ బాలుడి తల్లి దృష్టికి తీసుకెళ్లింది. కుమారుడు చేసిన పనికి ఆమెకు కోపం నషాలానికి ఎక్కింది. కొడుక్కి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనుకుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదంటూ తగిన శిక్ష వేయాలనుకుంది. బాలుడిని తీసుకొచ్చి నడిరోడ్డుపై బట్టలన్నీ విప్పించి..అండర్‌వేర్‌పై గోడకుర్చీ వేయించింది. బాలుడు ఎంత బతిమాలినా తల్లి మాత్రం వదల్లేదు.. గోడ కుర్చీ వేయించేదాకా వదిలిపెట్టలేదు. చుట్టూ జనాలు గుమికూడటంతో బాలుడు సిగ్గుతో తల దించుకున్నాడు. చుట్టుపక్క ఉన్న వారంతా ఏం జరిగిందంటూ ఆరా తీయడంతో జరిగిన విషయం చెప్పిందామె. అబ్బాయి చేసిన పని గురించి తెలుసుకొని కొందరు ఆ తల్లిని అభినందించారు. మరికొందరైతే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు. బాలుడి వీడియో ఇపుడక్కడ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూశాక నెటిజన్లు కొందరు తల్లికి మద్దతుగా కామెట్లు చేశారు. బాలుడిని ఇలాంటి శిక్ష వల్ల క్రమశిక్షణ అలవాటవుతుందని.. భవిష్యత్‌లోనూ తప్పులు చేయకుండా గుణపాఠమవుతుదని చెప్పారు. మరికొందరు మాత్రం బాలుడి తల్లి తీరుపై విమర్శించారు. చిన్న వయసులో అంతటి కఠినమైన శిక్షలు వేయడం సరికాదన్నారు. పిల్లవాడికి ఇలా శిక్షలు వేస్తే మరింత కఠినంగా తయారయ్యే ప్రమాదముందన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *