సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల సినిమాలు

సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల సినిమాలు

దసరా,సంక్రాతి పండగలు సినిమాలకు మంచి సీజన్. చాలామంది దర్శకనిర్మాతలు ఈ సీజన్‌నే టార్గెట్ గానే సినిమాలు తెరకెక్కిస్తారు.అయితే ఈ దసరాకి ఏయే సినిమాలు విడుదలవుతాయో క్లారిటీ లేదు కానీ.. సంక్రాంతికి మాత్రం పెద్ద సినిమాల లైన్ రోజు రోజుకి పెరిగిపోతుంది.

అనిల్ రావిపూడి, మహేష్ కాంబోలో తెరకెక్కనున్న సరిలేరు నీకెవ్వరు మూవీతో పాటు ప్రభాస్ ,రాధాకృష్ణ కలయికలో వస్తున్న మూవీతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్, శంకర్, కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తోంది.తాజాగా ఇప్పుడు మరో పెద్ద సినిమా కూడా సంక్రాతి లైన్ లోకి వచ్చేసిందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా సెట్స్ పై ఉన్నాడు. అయితే మన్మధుడు సినిమా తర్వాత నాగార్జున, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ బంగార్రాజు సినిమా చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాని ఆగస్టు నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడట. డిసెంబర్ కల్లా సినిమా పూర్తి చేసి సంక్రాతి బరిలో దింపే యోచనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా సంక్రాంతికే విడుదలై బిగ్గెస్ట్ హిట్ అవడంతో.. ఈసారి కూడా బంగార్రాజుని సంక్రాతి బరిలో దింపాలనే యోచనలో ఉన్నారట. . అయితే ఫైనల్ గా ఎన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *