కబీర్‌సింగ్ రచ్చ

కబీర్‌సింగ్ రచ్చ

అర్జుర్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ డ‌మ్ కొట్టేసిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా .ఈ మూవీ గురించి టాలీవుడ్‌తో పాటు ఇత‌ర స్టేట్స్‌ల‌లో కూడా చాలా మంది మాట్లాడుకున్నారు..ముఖ్యంగా ఈ సినిమాకు యూత్ ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యారు. సినిమాలో బూతులు, హాట్ సీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికి ఎవ‌రూ ఎక్స్ పెటేషన్స్ చేయాని రేంజ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వర్షం కురిపించింది.ఎక్క‌డ చూసినా ఈ మూవీ గురించిన చ‌ర్చ‌లే. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీని చూసిన బాలీవుడ్ సైతం ఆశ్చ‌ర్యపోయింది.. దీంతో అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెర‌కెక్కించాడు సందీప్ రెడ్డి.

తాజాగా అర్జున్ రెడ్డికి రీ మేక్ గా వ‌చ్చిన కబీర్ సింగ్ మూవీ 200 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.అంచ‌నాలు మించి ఈ మూవీ బాక్సాఫీసు బ‌ద్ద‌లు కొడుతుంది. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్, కియారా అడ్వాణీని ముద్దు పెట్టుకునే స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ సీన్స్ గురించి దేశ‌మంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రీ అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ కొంద‌రు మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ మూవీకి స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం..రిలీజ్ కావ‌డం..బాక్సులు బ‌ద్ద‌లు కావ‌డంతో దానిని ప‌ట్టించు కోవ‌డం మానేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ గురించి ఎక్కువ‌గా ప్రస్తావన రావడంతో ఈ విషయం పై డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి స్పందించాడు.ఒక అమ్మాయి, అబ్బాయి ఒక‌రినొక‌రు గాఢంగా ప్రేమించుకుంటున్న‌ప్పుడు ..ఒక‌రినొక‌రు కొట్టుకోవ‌డం, ముట్టు కోవ‌డం…లాంటివి చేయ‌క పోతే ఆ బంధానికి అర్థం ఏముంటుంద‌ని, భావోద్వేగాలు క‌నిపించ‌వంటూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. అయితే ఈ విషయంపై సమంత, సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద తో పాటు మరికొంతమంది ఘాటుగా స్పందించారు. దీనిపై కూడా సందీప్ క్లారిటీ ఇచ్చారు. తను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడానని.అయితే దురదృష్టవశాత్తు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు చెప్పాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *