యూటర్న్ మూవీ రివ్యూ

యూటర్న్ మూవీ రివ్యూ

థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన యూటర్న్

uturn movie review

కెరీర్ మొదట్లో కమర్షియల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సమంత స్టార్ హీరోయిన్ అయిన తర్వాత మాత్రం నటనకి ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులని అలరిస్తుంది.. అలా ఇన్నేళ్ల కెరీర్ లో సామ్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా యూటర్న్… ట్రైలర్ తోనే ఇదో థ్రిల్లర్ సినిమా చెప్పేయడంతో ఆ వర్గం ప్రేక్షకులు యూటర్న్ కోసం ఎదురు చూడడం మొదలుపెటారు.. ఎట్టకేలకు వినాయకచవితి కానుకగా ఈ సినిమా రిలీస్ అయ్యింది…

తను ఇంటర్న్షిప్ చేసే చోటే ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలని, ఓ హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ చేయాలి అనుకున్న రచన అనే అమ్మాయి, ఆర్కేపురం ఫ్లైఓవ‌ర్‌పై రోడ్ బ్లాక్స్ ను త‌ప్పించి యు ట‌ర్న్ తీసుకునే వారిని మీద స్టోరి చేస్తే బాగుంటుందని భావించి, అక్కడ రోడ్ క్రాస్ చేసే వాళ్ళ వెహికల్ నంబర్స్ ని పట్టుకొని, ప్రయాణికుల అడ్రస్ లు, ఫోన్ నంబర్లను రచన కలెక్ట్ చేసి వాళ్ళని కలిసి, తన డైరీలో రాసుకుంటూ ఉంటుంది… ఇలాంటి సమయంలో ఒక వ్యక్తిని రచన కలవాలి అనుకుంటుంది, కానీ అనుకోని పరిణామాల మధ్య, ఆ వ్యక్తి sucide చేసుకుంటాడు… దీంతో పోలీసులు ఎంక్వయిరీ కోసం రచనని తీసుకెళ్తారు.. అయితే రచన డైరీని చూసిన పోలీసులకి ఊహించని నిజాలు తెలుస్తాయి… ఇలాంటి సిట్యుయేషన్స్ లో రచన ఎలాంటి సంఘటనలు ఫేస్ చేసింది… ఆ వ్యక్తి ఎందుకు sucide చేసుకున్నాడు, రచన డైరీలో ఉన్నది ఎవరు అనేది యూటర్న్ సినిమా కథా కథనం…

uturn movie review

తన యాక్టింగ్ తో మెప్పించిన సమంత

నటీనటుల పరంగా చూస్తే ఇది కంప్లీట్ గా సమంత సినిమా, సినిమా మొదలైన పది నిమిషాలకే తన నటనతో కట్టిపడేస్తుంది… పోలీస్ గా కనిపించిన ఆది, క్రైమ్ రిపోర్టర్ పాత్రలో కనిపించిన రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకి న్యాయం చేసారు.. ఇక చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన భూమిక మంచి నటన కనబర్చింది… కన్నడ సినిమానే తెరకెక్కించిన పవన్ కుమార్, అంతే గ్రిప్పింగ్ గా తెలుగులో కూడా సినిమాని తీయడం విశేషం… సినిమా స్టార్ట్ అయిన కాసేపటి వరకు నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించినా కూడా ఒక్కసారి స్టోరీలోకి ఎంటర్ అయ్యాక, చాలా గ్రిప్పింగ్ గా నడిపించాడు, ఎక్కడా సినిమాకి అవసరంలేని అంశాలని టచ్ చేయలేదు కానీ సెకండ్ హాఫ్ లో రాబోయే కొన్ని ట్విస్ట్ లు ఒక వర్గం ప్రేక్షకులకి ముందే తెలిసిపోవడం కొంతమేరకు నిరాశపరిచి అంశం.. మ్యూజిక్ బాగుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్ ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి… మొత్తానికి యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు చేస్తున్న సామ్, యూటర్న్ సినిమాతో మంచి థ్రిల్లింగ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిందనే చెప్పాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *