నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ మూవీ చేస్తున్న సమంత

నందిని రెడ్డి దర్శకత్వంలో  ఓ బేబీ మూవీ చేస్తున్న సమంత

పెళ్లి తర్వాత స్పీడ్ పెంచింది అక్కినేని కోడలు సమంత.ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.అయితే మ్యారేజ్ తరువాత రూట్ మార్చిన సామ్ ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలతోనే సినిమాలు చేస్తుంది.ప్రజెంట్ నాగచైతన్యతో కలిసి పిరియాడిక్‌ రొమాంటిక్‌ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న మజిలిలో చిత్రంలో నటిస్తోంది.ఈ మూవీ పోస్టర్స్,టీజర్ ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెతీస్తున్నాయి.అయితే మూవీ సెట్స్ మీద ఉండగానే నందిని రెడ్డి డైరెక్షన్‌లో విభిన్న నేపథ్యం ఉన్న ఓ సినిమాలో యాక్ట్ చేసింది.ఆ చిత్రానికి సంబంధించిన ఓ లుక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత.Oh Baby film directed by Nandini Reddy

కొరియన్‌ చిత్రం మిస్‌ గ్రానీకి రీమేక్‌లో సమంత నటిస్తున్న సంగంతి తెలిసిందే.అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ బయటకు రాకుండా సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేశారు..ఇందులో ముందుగా అనుకున్నట్టుగా ఓల్డ్ ఉమెన్ పాత్రలో సమంతే చేయాలని భావించిన ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకుంది.ఏజ్‌బార్ క్యారెక్టర్‌లో సామ్‌కు బదులుగా సీనియర్‌ నటి లక్ష్మీ నటిస్తోంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన జర్నీని గుర్తు చేసుకుంటూ గాయనిగా కనిపిస్తోన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సామ్.ఈ లుక్‌కు నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఓ బేబీ టైటిల్‌తో ఎంత సక్కగున్నావే అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *