నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు

నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు

పెళ్లి తరువాత డిఫరెంట్ స్టోరీస్‌తో, చాలెంజింగ్‌ రోల్‌లో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. రంగస్థలం, యూటర్న్‌, మజిలి లాంటి సినిమాలతో మెప్పించిన సామ్‌, త్వరలోనే ఓ బేబి అంటూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్‌పై మీరు ఓ లుక్కెయండి…

సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ, నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సమంత సింగర్ గా కనిపించనుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రొమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్, ఓ బేబీ టీజర్ ని రిలీజ్ చేశారు.

‘నా పేరు సావిత్రి, చిన్నప్పుడు అందరు నన్ను భానుమతిలా ఉన్నావనేవాళ్ళు’ అంటూ నటి లక్ష్మి చెప్పే డైలాగ్‌ తో మొదలైన ఈ టీజర్ లో సమంత మెయిన్ హైలైట్ గా నిలిచింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి ఆకట్టుకున్న సామ్, టీజర్ చివరిలో ‘నాతో ఎంజారుమెంట్‌ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి, చూస్తారుగా..’ అంటూ సెటైరికల్‌గా చెప్పడం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. టీజర్‌ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *