సమంత షోలో యాక్షన్ ఇన్...ఓ బేబీ! ట్విటర్ రివ్యూలు

సమంత షోలో యాక్షన్ ఇన్...ఓ బేబీ! ట్విటర్ రివ్యూలు

చేయాలనుకుంటే మంచి సినిమాలు మాత్రమే చేస్తాను.. లేకుంటే ఇంట్లో కూర్చుంటాను అని చెప్పి వరుసగా పక్కా బ్లాక్ బస్టర్ హిట్‌లు కొడుకున్న అక్కినేని ఇంటి కోడలు సమంత తాజాగా ‘ఓ బేబీ’ చిత్రంతో పలకరించేందుకు నేడు (జూలై 05)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సమంత భుజాలమీదే!

ఈ చిత్రానికి ‘అలా మొదలైంది’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో సమంత 24 ఏళ్ల యువతిగా చేస్తూనే 70 ఏళ్ల బామ్మగా కూడా డిఫరెంట్ రోల్ చేసి తెలుగు సినీపరిశ్రమలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై సరైన అంచనాలను పెంచేసిన సమంత.. ఈ మూవీ ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాలమీద వేసుకుని గతంలో లేనంతగా విపరీతమైన ప్రచారాన్ని తీసుకొచ్చారు. ఈ చిత్రానికి విడుదలకు ముందే మంచి చర్చ జరగడంతో సమంత సోలో మూవీని ప్రపంచ వ్యాప్తంగా నేడు భారీగా విడుదల చేశారు.

బాక్సాఫీస్ షేక్…

‘తెలుగు సినిమా పరిశ్రమకు కావాల్సింది ఇలాంటి విభిన్నమైన చిత్రాలే.. థియేటర్స్‌కి వెళ్లి తప్పకుండా ఈ చిత్రాన్ని చూడమని మా అమ్మకి చెప్పాను.. ‘ఓ బేబీ’ చిత్రం ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది. నా రేటింగ్ 4/5′.. ఇదీ సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రంపై ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన. ఇప్పటికే ఈ సినిమా యూఎస్, యూకేలలో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు స్పందనలు తెలియజేస్తున్నారు. సమంత కెరియర్‌‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని..రాక్ స్టార్‌లా సమంత నటనతో సినిమాను ముందుకు తీసుకెళ్లిందని.. క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉందంటున్నారు. కొందరైతే తమ గ్రాండ్ మదర్స్‌తో ఓ బేబీ చిత్రాన్ని వీక్షించి అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే అదే సందర్భంలో ఎమోషనల్ డ్రామాగా అందమైన సన్నివేశాల్ని చూశామని.. ఈవారం బాక్సాఫీస్‌ని ‘ఓ బేబీ’ షేక్ చేయడం ఖాయమే అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *