మరోసారి కలిసి నటించబోతున్న సమంత, నాగచైతన్య

మరోసారి కలిసి నటించబోతున్న సమంత, నాగచైతన్య

రీల్ లైఫ్ లో స్ర్కీన్ షెర్ చేసుకున్న సమంత,నాగచైతన్య మ్యారెజ్ చేసుకొని లైఫ్ ని షేర్ చేసుకుంటున్నారు. అయితే మ్యారెజ్ తరువాత ఈ జంట నటించిన మూవీ మజిలీ. రీసెంట్‌గా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. హిట్ ఫేయిర్ అనిపించుకున్న ఈ జోడీ మరో సినిమాలో నటించబోతున్నారని సమాచారం. మరి చైతు, సామ్ కలిసి చేయబోతున్న ఆ ప్రాజెక్ట్ ఎంటో చూద్దాం…

టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత. రీల్‌ పెయిర్‌గా సక్సెస్‌ అయి తరువాత రియల్‌ లైఫ్‌లోనూ బెస్ట్ పెయిర్‌ అనిపించుకున్న జంట ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేశారు. ఈ మూవీ తరువాత ఈ ఇద్దరు నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకులనే బాగానే ఆకట్టుకున్నాయి. ఆటోనగర్ సూర్య సినిమాలతోనూ ఆకట్టుకున్నారు. అయితే సినిమాల సక్సెస్‌ని పక్కన పెడితే ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి మాత్రం ఫుల్‌ మార్కపడ్డాయి. ఈ హిట్ ఫేయిర్‌లో స్క్రీన్ మీద చూడానికి అక్కినేని అభిమానులతో పాటు మిగత ఆడియన్స్ కూడా ఇష్టపడుతారు. రీసెంట్‌గా వచ్చిన మజిలీ మూవీతో మరోసారి హిట్ ఫేయిర్ అనిపించుకున్నారు సామ్ చై.

తాజాగా మజిలీ సినిమాతో మరోసారి హిట్ మ్యాజిక్‌ని రిపీట్ చేశారు ఈ జోడి. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ ఘన విజయం సాధించటమే కాదు ఇప్పటికే 50 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. దీంతో మరో సినిమాలో కలిసి నటించేందుకు చైతూ, సమంతలు రెడీ అవుతున్నారట. మెర్లపాక గాంధీ డైరెక్షన్‌లో చైతూ ఓ సినిమాలో నటించేందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్‌తో సమంత , చైతూ కలిసి నటించబోతున్నారని టాలీవుడ్ సర్కీల్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ అక్కినేని జంట మరోసారి మ్యాజిక్‌ చేస్తుందేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *