బాక్సాఫీస్ షేక్ అవబోతున్నట్లే...

బాక్సాఫీస్ షేక్ అవబోతున్నట్లే...

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు రంజాన్ సెంటిమెంట్ మరోసారి అచ్చోచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. తాజా రిలీజైన భారత్‌ మూవీ భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మరి ఫస్ట్ డే ఈ మూవీ ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ…సల్మాన్‌ఖాన్‌కు రంజాన్‌ సెంటిమెంట్‌ మరోసారి వర్క్‌వుటయింది. వివాదాల మధ్య రిలీజైన భారత్ మూవీ సల్మాన్‌ కెరీర్‌లో ఫస్ట్ డేనే అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎక్స్ పెటేషన్స్‌కు తగ్గట్టే ఫస్ట్ డే రూ.42.30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటివరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో రంజాన్‌కు విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. రంజాన్‌ రోజు రిలీజై ఫస్ట్ డేనే టైగర్‌ జిందా హై రూ.34.10 కోట్లు, సుల్తాన్‌ రూ.36.54 కోట్లు, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో రూ.40.35 కోట్లు సాధిస్తే భారత్ మూవీ ఈ సినిమాల కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుండడంతో సల్మాన్‌ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈజీగా వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *