'పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై' అంటున్న ముద్దుగుమ్మ

'పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై' అంటున్న ముద్దుగుమ్మ

పాతికేళ్లు వ‌చ్చాయంటే ఇంట్లో మొద‌ల‌య్యే మొదటిప్ర‌శ్న పెళ్లెప్పుడు అని..? ఇలాంటిది ఇప్పుడు ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఏకంగా పెళ్లే చేసుకోన‌ని స్టేట్మెంట్స్ ఇచ్చేస‌రికి టాలీవుడ్ సర్కీల్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. ఇంతకీ ఈ బ్యూటీ పెళ్లి అంటే ఎందుకు వద్దంటుంది. ఉన్న‌ట్లుండి ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకోడానికి గ కార‌ణ‌మేంటో తెలియాలంటే ఈ స్టోరీ ఫాలో అవ్వాల్సిందే.ప్రేమమ్‌ సినిమా సౌత్ ఇండస్ట్రీ ని ఊపేసిన మల్లార్‌ బ్యూటీ సాయి పల్లవి. ఫిదా మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ భామ ఫస్ట్ సినిమాతోనే అందరిని ప్లాట్ చేసింది. సాయి పల్లవి మలయాళీ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇటు తెలుగులో అటు కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.ఆ మధ్య పడి పడి లేచే మనసు, మారి 2 సినిమాలుకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. సాయి పల్లవి నటనకి మంచి మార్కులే పడ్డాయి.ఇక రీసెంట్‌గా వచ్చిన ఎన్టీకే మూవీతో మరో ప్లాప్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన స్టేంట్ మెంట్ ఇచ్చింది. అమ్మడు ఇచ్చిన స్టేట్ మెంట్‌కు ఒకసారిగా అంతా అవాక్కయ్యారు.

పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం పెళ్ళే చేసుకోన‌ని ఖ‌రాఖండీగా చెప్పేసింది. ఈ అమ్మ‌డి స‌మాధానానికి నెటిజ‌న్స్ బిత్త‌ర‌పోతున్నారు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కన్య‌గానే ఉండిపోతావా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రికొంద‌రు దేవుడు ఆమె మ‌న‌సు మార్చి పెళ్లి చేసుకునేలా చేయాల‌ని కోరుకుంటున్నారు . ఏదైన సాయిప‌ల్ల‌వి ఇచ్చిన షాక్‌కి నెటిజ‌న్స్ కోలుకోవ‌డానికి కాస్త టైం ప‌ట్టేలా ఉంది. ప్రస్తుతం తెలుగులో రానాతో విరాటపర్వం సినిమాలో నటించబోతుంది. ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *