మరోసారి పాత రూట్లో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్

మరోసారి పాత రూట్లో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కి ఉన్న రికార్డు ఎవరికీ ఉండి ఉండదేమో… బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మెగా ఫ్యామిలీకి మరో పవర్ స్టార్ దొరికాడు అందుకుంటున్న సమయంలో వరసగా ఆరు ఫ్లాపులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక తేజ్ కెరీర్ అయిపొయింది అనుకుంటున్న టైములో చిత్రలహరి సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత తేజ్ కి దక్కిన ఈ విజయం మెగా అభిమానులని సంతోష పెట్టింది కానీ ఈ మూవీ తర్వాత మన సుప్రీమ్ హీరో తీసుకున్న ఒక నిర్ణయం ఫ్యాన్స్ ని భయపెడుతోంది.

హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్న తేజ్, ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ సినిమాని మారుతీ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా తేజ్ చేసిన చిత్రలహరి సినిమాలో కూడా తండ్రి కొడుకుల మధ్య అనుబంధం.. ఆ మూవీ రిజల్ట్ లో చాలా హెల్ప్ అయ్యింది. మళ్లీ అదే పాయింట్ తో వెంటనే ఇంకో సినిమా చేస్తే ప్రేక్షకులు దాన్ని ఎంత వరకూ యాక్సెప్ట్ చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా మారుతీ ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా లేదు, మినిమమ్ గ్యారెంటీ సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఇప్పుడు తేజ్ కి కావాల్సింది మినిమమ్ గ్యారెంటీ మూవీ కాదు… సాలిడ్ హిట్, గత ఫ్లాపులని మర్చిపోయే రేంజ్ హిట్ కావాలి, చిత్రలహరి విజయం గాలి వాటం కాదు అని చెప్పే సినిమా కావాలి. అప్పుడే తేజ్ సక్సస్ అయినట్లు… ఇవేమి పట్టించుకోని తేజ్, మళ్లీ అదే పాత రూట్లో నడుస్తూ సినిమాలు చేయడం మెగా అభిమానులని భయపెడుతోంది. తేజ్ ఆ భయాన్ని తప్పని నిరూపిస్తూ హిట్ ఇస్తాడా లేక మరోసారి ఫ్లాప్ ఇచ్చి చిత్రలహరి విజయం ఉత్త గాలివాటం అనిపిస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *