'సాండ్‌ కీ ఆంఖ్‌' మూవీ టీజర్ రిలీజ్

'సాండ్‌ కీ ఆంఖ్‌' మూవీ టీజర్ రిలీజ్

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా తుషార్‌ హీరానందని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం సాండ్‌ కీ ఆంఖ్‌. 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లో తాప్సీ పన్ను న‌టిస్తుండ‌గా,82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తుంది.ఇందులో అక్కా చెల్లెళ్ళుగా తాప్సీ, భూమి మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో నివ‌సించే అక్కా చెల్లెళ్ళ‌కి చిన్న‌ప్పుడే పెళ్లి కావ‌డంతో త‌మ జీవితం అంతా కుటుంబం కోసం వెచ్చిస్తారు. అయితే త‌మ‌లా మిగతా వారు కాకూడ‌ద‌ని ఆరాట‌ప‌డ‌తారు. ఆ గ్రామంలో చ‌దువుల‌ని అడ్డుకునే వాళ్ళ‌ని తుపాకుల‌తో బెదిరించే వారు చంద్రో, ప్ర‌కాశీ. ఈ క్ర‌మంలో తెలియ‌ని టాలెంట్ త‌మ‌లో ఉంద‌ని గుర్తించిన ఈ ఇద్ద‌రు అక్కా చెల్లెళ్ళు ఓ సారి జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్క‌డ నుండి వారి లైఫ్ మారింది అనేదే సినిమా.దీపావ‌ళి కానుక‌గా సినిమాని రిలీజ్ చేసేందుకు రిలీజ్ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *