హాట్ బ్యూటీకి వరుసగా ఆఫర్లు

ఆర్ ఎక్స్ 100 సినిమాలతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో అమ్మడి ఆఫర్లు వెల్లువెత్తుతాయనుకుంటే కుర్ర హీరోల పక్కన పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ సీనియర్ హీరోలు మాత్రం ఈ బ్యూటీతో నటించాడనికి ఇంట్రేస్ట్ చూపిస్తున్నారు. డైరెక్టర్స్ కూడా మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న పాయల్ అయితే సీనియర్ హీరోలకు జోడీగా బాగుంటుందని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మాస్ రాజా రవితేజతో డిస్కోరాజా సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మన్మధుడు 2సినిమాలో కూడా పాయల్ హీరోయిన్ గానే నటిస్తోంది. అయితే మెయిన్ లీడ్ మాత్రం పాయల్ కాదనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకా పాయల్ చేతిలో మరో సీనియర్ హీరో సినిమా కూడా ఉందని తెలుస్తోంది. ఇలా ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోల సరసన నటించే అవకాశం రావడంతో పాయల్ రాజ్ పుత్ తన ఫ్యూచర్ గురించి డైలమాలో పడినట్లు ఉంది. అన్ని సినిమాల్లో పెద్ద హీరోల పక్కనే నటిస్తే ముదురు హీరోయిన్ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది కాబట్టి, ఆ ట్రాక్ నుంచి బయటకి రావడానికి గ్లామర్ బాటపట్టి పట్టి సోషల్ మీడియాలో వరస ఫోటోలు పెడుతోంది. తను యంగ్ హీరోల పక్కన కూడా నటించగలనని ప్రూవ్ చేసేలా ఉన్న ఆ హాట్ ఫోటోలు నెట్లో బాగానే హల్చల్ చేస్తున్నాయి. ఇవి చూశాక అయినా పాయల్ కి యంగ్ హీరోల పక్కన అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *