నాలుగు నెలల పసికందుతో సాహసాలు

నాలుగు నెలల పసికందుతో సాహసాలు
నాలుగు నెలల పసికందు ఉంటే ఎత్తుకుని ముద్దు చేయడం…అటుఇటు తిప్పడం చేసి జోల పాడతాం. ఏ తల్లిదండ్రులైనా పుట్టిన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలెక్కడికి వెళ్లకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఓ జంట తమ నాలుగు నెలల పసికందును రద్దీగా ఉండే వీధుల్లో ప్రదర్శన కోసం గాల్లో ఎగరేస్తూ చేసిన పని వారిని జైలు పాలయ్యేలా చేసింది. అసలు వాళ్లు ఎందుకు అలా చేశారో తెలుసుకుందాం.

ప్రమాదకరమైన ప్రదర్శన…

రష్యాకు చెందిన ఓ జంట..మలేషియాలోని బుకిత్ బింటాంగ్‌లో… ఆటలో భాగంగా వారి పసిపిల్లాడిని గాల్లో ఎగరేస్తూ ప్రదర్శన చేశారు. అలా గాల్లోకి ఎగరేసి కిందికి వచ్చినపుడు ఒకసారి చేతుల్ని పట్టుకోవడం, మరోసారి కాళ్లు పట్టుకోవడం లాంటివి చేస్తూ ప్రదర్శన చేశారు. వీధిలో కావడంతో వారి ప్రదర్శన చూసిన వారిని కొందరు చప్పట్లు చరిచి ప్రోత్సహించారు. మరికొందరు అంత చిన్న పిల్లాడిని అలా గాల్లోకి ఎగరేస్తుంటే ఆశ్చర్యపోయారు. మిగిలిన వారు తన ఫోన్‌లలో వీడియో తీశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతూ పోలీసుల వద్దకు చేరింది. విషయం తెలుసుకుని వీడియోలో ఉన్న వాళ్ల గురించి ఆరా తీశారు. రష్యా నుంచి వచ్చిన టూరిస్టులుగా దర్యాప్తులో తేలింది. వెంటనే వారు ఎక్కడ ఉన్నారో కనుక్కుని అరెస్ట్ చేశారు.

సాధారణంగా రష్యాలో పిల్లల్ని ఇలా ఆడించడం బేబీ డైనమిక్ లేదంటే బేబీ స్వింగింగ్ యోగా అని పిలుస్తారు. అయితే…ఆ రష్యా జంట డబ్బుల కోసమే ఈ ప్రదర్శన ఇస్తున్నారు. కానీ మలేషియా చట్టాల ప్రకారం నేరం అవుతుంది. మలేషియాలో ఇలా చేయకూడాదనే విషయం తెలియక పోలీసులకు బుక్ అయ్యారు. పోలీసులు ఆ చిన్నారిని వైద్య పరీక్షల కోసం పంపించారు. ప్రస్తుతం ఆ జంటను విచారిస్తున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *