రష్యాలో ఘోర విమాన ప్రమాదం..

రష్యాలో ఘోర విమాన ప్రమాదం..

రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ విమానం అత్యవసరంగా దిగిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాస్కో నుంచి బయల్దేరిన ఈ విమానం.. కొద్దిసేపటికే.. సాంకేతిక కారణాలతో అత్యవసర ల్యాండింగ్‌ అయ్యింది. ఆ క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. అవి కొద్దిసేపటికే విమానం వెనుక భాగంలో పెద్ద ఎత్తున అలముకున్నాయి. దీంతో అందులోని ప్రయాణికులు 41 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ముందువైపు ద్వారం నుంచి బయటపడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *