అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచుతున్న భామ

అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచుతున్న భామ

రుహాణి శర్మ. చి లా సౌ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహాణి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అందరినీ బాగానే మెప్పించింది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ కి మంచి హీరోయిన్ దొరికింది అనే కాంప్లిమెంట్స్ అందుకున్న ఈ భామకు, తెలుగులో వరసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ చి లా సౌ సినిమా విడుదలై ఏడాది దాటుతున్నా కూడా మరో సినిమాలో నటించే ఛాన్స్ రాలేదు అమ్మడికి. కనీసం రుహాణి సైన్ చేసిన మూవీ కూడా లేదు, మరి ఈ బ్యూటీ దగ్గరకి దర్శకులు వెళ్లట్లేదో, లేక రుహాణినే వద్దంటుందో తెలియదు కానీ ఈ చిన్నది మాత్రం నెక్ట్స్ సినిమా గురించి ఏం మాట్లాడట్లేదు.

చి లా సౌ సినిమాలో గ్లామర్‌ పాత్రలో కాకుండా హోమ్లీ క్యారెక్టర్‌లో నటించి అందరికి కనెక్ట్ అయింది. అయిన టాలీవుడ్‌లో మరో ఛాన్స్ రాలేదు. హోమ్లీగా ఉంటే అవకాశాలు రావడం లేదని అనుకుందో ఏమో అందుకే ఛాన్సుల కోసం గ్లామర్ డోస్ పెంచింది. చి లా సౌ సినిమాలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించిన రుహాణి తన ఇంస్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో హాట్ ఫోజులతో ఫోటోలు పెడుతూ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తుంది. అవకాశాల కోసమో, లేక మరేదైనా కారణమో తెలియదు కానీ రుహాణి హాట్ ఫోటోలు మాత్రం యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి హద్దులు దాటిన అందాల ప్రదర్శన అయినా ఆమెకి అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *