కోడిపై కేసు...కోర్టులో విచారణ!

కోడిపై కేసు...కోర్టులో విచారణ!

ఆ కోడిపై కేసు. కోర్టులో ఆ కేసు నడుస్తోంది. ఫ్రాన్స్ సమీపంలోని ఓలెరాన్ అనే ద్వీపంలో ఈ కోడి ఉంటుంది. ఆ కోడి ఆ ఊరి కంటే ముందే నిద్ర లోచి.. ‘కొక్కొరొకో… కొక్కొరొకో..’ అంటూ అందరిని నిద్ర లేపుతుంది. అయితే, ఆ చుట్టుపక్కల వారు దాని గోల భరించలేకపోయారు. అది రోజురోజుకు మరింత పెద్దగా అరుస్తుండడంతో చుట్టుపక్కల వారికి కోపం నషాలానికి అంటింది. దీంతో చుట్టుపక్కల వారు ఆ కోడి మీద కేసు పెట్టారు. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. నగరాల్లో ఉద్యోగాలు చేసుకుని.. హాయిగా విశ్రాంత జీవితాన్ని అనుభవిద్దామని.. మేం ద్వీపానికి వస్తే.. ఇక్కడ ఈ కోడి తమను శాంతిగా ఉండనివ్వట్లేదంటూ ఓ వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నీ ఫెయిల్…

ఆ కోడి అరవకుండా కట్టడి చేయడానికి దాని యజమాని కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడట. రాత్రి పూట కోడి గుడ్లు పెట్టే బాక్సులను దాని గంప చుట్టూ పెడుతున్నారట. అలాగైనా.. దాని అరుపు బయటకు వెళ్లకుండా ఉంటుందని భావించాడు. కానీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే, ఆ చుట్టుపక్కల 40 మంది ఉన్నారని.. వారు సర్దుకుపోతున్నారని…కేవలం కొత్తగా వచ్చిన ఈ వృద్ధ దంపతులే ఫిర్యాదు చేశారని కోడి యజమాని కోర్టుకు వివరించాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *