కటకటాల పాలైన రౌడీ బేబీ సాంగ్ కొరియో గ్రాఫర్‌

కటకటాల పాలైన రౌడీ బేబీ సాంగ్ కొరియో గ్రాఫర్‌

సినిమాలో ఛాన్స్‌ ఇప్పించి పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కొరియో గ్రాఫర్‌ వినయ్‌ షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ధనుష్ మారి 2 “రౌడీ బేబీ”సాంగ్‌ను మెహేబుబ్ దిల్ సే, దీప్తి సునైనకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేసింది ఇతడే. ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్‌కు డైరెక్షన్, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బాధ్యతలు సమర్ధవంతగా నిర్వహించాడు వినయ్ షణ్ముఖ్‌. ఇతడు ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. విశాఖ సీతమ్మదారకు చెందిన సిర్‌గూడి షణ్ముఖ్‌ వినయ్‌ సినిమా పరిశ్రమలో రాణించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం మాదాపూర్‌లోని మస్తాన్‌నగర్‌కు వచ్చాడు. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహబూబ్‌తో పరిచయం పెంచుకొని సాంగ్స్‌ కంపోజ్‌ చేస్తున్నాడు. సినిమాలో సైడ్‌ డ్యాన్సర్‌లుగా అమ్మాయిలు కావాలని మహబూబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇది చూసి ఉప్పల్‌కు చెందిన ఓ యువతి మహబూబ్‌ స్టూడియోకు వచ్చింది. అప్పుడు అక్కడే ఉన్న షణ్ముఖ్‌ వినయ్‌ ఆ యువతిని పరిచయం చేసుకుని సాన్నిహిత్యం పెంచుకున్నాడు. దీంతో వారిద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఎలాగైనా సినిమాలో రాణించాలనుకున్న ఆ యువతి మాటలను ఆసరాగా తీసుకొని తనకు సినిమాలో చాలా మంది తెలుసని, వారితోపాటు తన స్నేహితులను కూడా పరిచయం చేస్తానని ఫోన్‌లో చెప్పాడు. తాను చెప్పినట్లు చేస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తరువాత ఫోన్‌లో పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే బుకాయించేవాడు. దీంతో చేసేదిలేక మహబూబ్‌ స్టూడియో వద్దకు వచ్చి షణ్ముఖ్‌ను నిలదీసింది. నీ కులం వేరు కాబట్టి మ్యారేజ్‌చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో ఆ యువతి మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని షణ్ముఖ్‌ వినయ్‌ని రిమాండ్‌కు తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *