దుమ్ము లేపుతున్న రోహిత్...దూసుకుపోతున్న రన్‌రేట్!

దుమ్ము లేపుతున్న రోహిత్...దూసుకుపోతున్న రన్‌రేట్!

క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఊహించినట్టుగా వరుణుడు కరుణించడంతో మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కాలేదు. దీంతో సరైన సమయానికే మ్యాచ్ మొదలైంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నిలకడైన ఆటతీరుతో రాణించారు. లోకేష్ రాహుల్ అర్ద సెంచరీ చేసి ఔటవగా రోహిత్ శర్మ సెంచరీతో దూసుకెళ్లాడు.మొదటి పది ఓవర్లను చాలా నెమ్మదిగా ఆడి వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసిన రోహిత్, రాహుల్ ఆ తర్వాత స్పీడ్ పెంచారు. ఇదే క్రమంలో రాహుల్ ఔటైన తర్వాత రోహిత్ తన బ్యాట్ స్పీడుని పెంచాడు. 30 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 177 పరుగులు చేశారు. క్రీజులో రోహిత్ 102, కొహ్లీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. చిరకాల ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన భారత్, పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో తప్ప ఇతర క్రికెట్ సంబంధాలు తెగదెంపులు అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ అరుదుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు పుల్వామా దాడి తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో భావోద్వేగాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు 6 సార్లు మ్యాచ్ లో తలపడగా, అందులో భారత్ ఆరుసార్లు మ్యాచ్ గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్ కు వరల్డ్ కప్ లో భారత్ పై గెలవడం అనేది ఒక తీరని కలగా మిగిలిపోయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *