సెమీస్‌లో అందుకే ఓడిపోయాం: రోహిత్ శర్మ ఆవేదన

సెమీస్‌లో అందుకే  ఓడిపోయాం: రోహిత్ శర్మ ఆవేదన

ఈ ప్రపంచకప్‌లో 5 సెంచరీలతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌ శర్మ.. కీలక సెమీస్‌ పోరులో మాత్రం ఒకటే పరుగు చేసి ఔటయ్యాడు. రోహిత్‌తో పాటు కోహ్లి, రాహుల్‌లు కూడా ఒక పరుగుకే నిష్క్రమించడం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
కీలకమైన సమయంలో జట్టుగా విఫలం చెందినందునే సెమీస్‌లో ఓడిపోయామని పేర్కొన్నాడు. 30 నిమిషాల చెత్త ఆట కారణంగా…ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నామని అన్నాడు. మీకులాగానే తనకు కూడా గుండె భారమైయ్యిందని ఆవేదన వ్యక్తంచేశాడు.దేశానికి బయట ఆడుతున్న తమకు అభిమానుల నుంచి వచ్చిన మద్దతు వెలకట్టలేనిదని వ్యాఖ్యానించాడు. యూకేలో టీమిండియా ఎక్కడ ఆడినా భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపిన అభిమానులందరికీ ధన్యవాదులు తెలియజేసుకుంటున్నట్లు రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *