చెలరేగిన హిట్‌మ్యాన్‌ ...రెండోటి20లో భారత్‌ ఘనవిజయం

చెలరేగిన హిట్‌మ్యాన్‌  ...రెండోటి20లో  భారత్‌ ఘనవిజయం

రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను నిదానంగా మొదలు పెట్టాడంటే, అది కచ్చితంగా తుపానుకు ముందు ప్రశాంతతే అనుకోవాలి! మరో భారీ స్కోరుకు క్రీజులో బలమైన పునాది వేస్తున్నాడని భావించాలి! తానేదో బీభత్సం సృష్టించబోతున్నాడని అర్థం చేసుకోవాలి! అతడి రికార్డులు, ఘనతలు చూసి అద్భుతం చేయబోతున్నాడని ఊహించాలి! మంగళవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన రెండో టి20లో సరిగ్గా ఇవన్నీ అలా… అలా… ఓ కలలా సాగిపోయాయి.

చెలరేగిన హిట్‌మ్యాన్‌

‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ (61 బంతుల్లో 111 నాటౌట్‌; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) బ్యాట్‌ నుంచి హీరోచిత శతకం జాలువారిన వేళ… టీమిండియా వెస్టిండీస్‌ను 71 పరుగుల తేడాతో చిత్తు చేసి మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది.

Rohit Sharma Records

కెప్టెన్‌ విధ్వంసానికి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (14 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచారు. ఫలితంగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

సిరీస్‌ 2–0తో కైవసం

కుర్ర పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ (2/30)… ‘చైనామన్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (2/32) ధాటికి ఛేదనలో విండీస్‌ ముందే కుదేలైంది. భువనేశ్వర్‌ (2/12), బుమ్రా (2/20) దెబ్బకు 124/9 వద్దే ఆగిపోయింది. డారెన్‌ బ్రావో (23) స్కోరే అత్యధికం కావడం ఆ జట్టు ప్రదర్శనను చెబుతోంది. రోహిత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌ ఈ నెల 11న చెన్నైలో జరుగుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *