రికార్డుల దుమ్ము దులుపుతున్న రజినీ 2.0

రికార్డుల దుమ్ము దులుపుతున్న రజినీ 2.0

అందరూ ఊహించినట్టుగానే రజినీ 2.0 రికార్డులతో సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటిరోజే విజువల్ వండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా…ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 100 కోట్లు సాధించింది. ఒక్క హిందీ వర్షనే దాదాపు 65 కోట్లు సాధించి సినీ లెక్కల దుమ్ముదులిపింది. వారాంతం వల్ల ఈ కలెక్షన్లకు ఏ మాత్రం జోరు తగ్గలేదు. రెండోరోజు కంటే మూడవ రోజు కలెక్షన్లు ఎక్కువున్నాయని తరుణ్ ఆదర్శ్ అన్నారు.

Robo 2pointO 500 Crore

రూ. 200 కోట్లు…

ఈ ఒక్క రికార్డే కాకుండా రజినీ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రజినీ నటించిన రోబో, కబాలి సినిమాలు రూ. 200 కోట్ల పైగా సాధించాయి. సౌత్ ఇండస్ట్రీల్లో రూ. 200 కోట్లతో రెండు సినిమాలున్న కథానాయకుడు రజినీ…ఇపుడు ఈ కోవలో 2.0 కూడా చేరడంతో మొత్తం మూడు సినిమాలున్న ఏకైక స్టార్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు.

రూ. 400 కోట్లు…

అలాగే నాలుగు రోజుల్లో 400 కోట్లు రికార్డుని సాధించి, బాహుబలి 2 సినిమా లాగా వరుసగా రోజూ వంద కోట్లు సాధించి రికార్డుల మీద రికార్డులను దక్కించుకుంటోంది. బాలీవుడ్ సినిమాలు కూడా ఈ రేంజ్‌లో రికార్డులు సాధించలేకపోయాయి. బాహుబలి తర్వాత 2.0 సినిమానే వరుసరోజుల్లో వందకోట్లను సాధిస్తోంది. వీక్‌డేస్‌లోనూ మోస్తరు కలెక్షన్లతో 2.0 కలెక్షన్లు సాగుతూనే ఉంది.

రూ. 500 కోట్లు

ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో 2.0 సినిమాను నిర్మించారు. ఎనిమిది రోజుల్లో రూ. 500 కోట్ల మార్క్‌ని చేరుకుంది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే లాంగ్‌రన్‌లో రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించి బాహుబలి తర్వాత స్థానం సంపాదిస్తుందేమో చూడాలి. వెయ్యి కోట్లు వసూలు చేస్తే పెట్టిన పెట్టుబడి రెట్టింపు వేగంతో నిర్మాతల, సినిమా బయ్యర్ల జేబుల్లో చేరినట్టే….అయితే వస్తున్న వారాంతంలో అంటే డిసెంబర్ 7న ఒకేరోజు నాలుగు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నందున 2.0 సినిమా ఇంతే రేంజ్‌లో రికార్డులను బద్దలుకొడుతూ కలెక్షన్లను సాధిస్తుందా అనే అనుమానం కలుగుతోంది.

ఏదేమైనా ఇన్నాళ్లు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు మాత్రమే వందల కోట్లలో కలెక్షన్లు సాధిస్తాయి అనుకునేవాళ్లకు సౌత్ సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు సాధించగలవని మన కొత్త సినిమాలు నిరూపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *