రోబో 2.0 స్క్రీన్ కౌంట్ తెలిస్తే మైండ్ బ్లాంక్ ...

రోబో 2.0 స్క్రీన్ కౌంట్ తెలిస్తే మైండ్ బ్లాంక్ ...

రజినీకాంత్, ఇండియన్ సూపర్ స్టార్, వరల్డ్ వైడ్ సినీ అభిమానులని కేవలం తన స్టైల్ తో థియేటర్స్ వైపు రప్పించగల హీరో. హిట్ ఫ్లాప్ కి సంబంధం లేని క్రేజ్ అతని సొంతం. అందుకే ఎన్ని సినిమాలు పోయినా కూడా రజిని మూవీ వస్తుంది అంటే ఇప్పటికీ ఆ భారీ హైప్ అలానే ఉంటుంది. బహుశా ఆ స్టామినా రజినీకి మాత్రమే సొంతమేమో.

robot 2.o

ప్రపంచవ్యాప్తంగా మొదలైన రజినీ మ్యానియా

సునామి లాంటి రజినీకి టెక్నీకల్ వండర్ శంకర్ కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే రెండు సినిమాలతో చూసేసాం. ఈ హిట్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా రోబో 2.0. రోబోకి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కన్నా ఎక్కువ స్టార్ కాస్ట్ ఉంది. ఇండియన్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే అయిదు వందల కోట్లు ఖర్చుపెట్టడం అంటే మాటలు కాదు, అయితే శంకర్ దీని వెనక్కి తీసుకురావడానికి రజిని మ్యానియాని గట్టిగా వాడుతున్నాడు.

Robot 2.o

హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 6800 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఇండియన్ హిస్టరీలోనే ఇది భారీ రిలీజ్. మొత్తం మీద రోబో 2.0 ఫస్ట్ డే దాదాపు 50 వేళ షోస్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులని 80 కోట్లకి అమ్మారు, ఒక టాప్ హీరో సినిమా సూపర్ హిట్ తెచ్చుకున్నా కూడా ఇంత మొత్తం రాబట్టడం కష్టమే.. మరి డబ్బింగ్ సినిమాకే అంత ప్రీ-రిలీజ్ బిజినెస్ అంటే అది కచ్చితంగా రజినీకాంత్ స్టార్ పవర్ మహిమే. 6800 థియేటర్లు, 50000 షోలంటే రోబో 2.0కి ఖర్చుపెట్టిన డబ్బులకి ఎలాంటి ఢోకా లేదు కానీ. ఇప్పుడున్న హైప్ కి కొంచెం పాజిటివ్ టాక్ తోడైన కూడా రోబో 2.0 రజినీకాంత్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బాక్సాఫీస్ సునామి సృష్టించడం ఖాయం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *