అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన వాహనం

అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన వాహనం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్‌ ఎన్ పేట మండలం రవిచంద్రి వద్ద అదుపు తప్పి ఓ వాహనం..పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురి పరిస్థితి విషమించటంతో..స్థానికులు హిరమండలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వీరంతా హిరమండలం సుబలై గ్రామంలో వివాహ వేడుక ముగించుకొని.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రేవెల్ల గ్రామానికి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారంతా వరుడి బంధువులుగా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *