రిషబ్‌ పంత్ మ్యాచ్ ఫిక్సింగ్

రిషబ్‌ పంత్ మ్యాచ్ ఫిక్సింగ్

ఐపీఎల్‌ను క్రేజ్‌తో పాటు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నైసూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు రెండేళ్ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాయి.ఆ తర్వాతా దాదాపు ప్రతి సీజన్‌లోనూ ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.కిందటి తరాల్లో ఎంతోమంది టాలెంటెడ్‌ ఆటగాళ్లు ఫిక్సింగ్‌తో తమ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వచ్చినా…ఆ తర్వాతి తరాల్లోనూ ఈ సంస్కృతి కొనసాగుతూనే వచ్చింది.ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… ఈ వివాదాలకు తెరపడటం లేదు.ఇప్పుడో యువ క్రికెటర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసాడంటూ…కొందరు నెటిజన్లు కోడై కూస్తున్నారు.

పంత్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసాడా?

కొత్తగా టీం ఇండియాకు వచ్చిన కుర్రాళ్లలో రిషబ్‌ పంత్‌కు ఆమోఘమైన టాలెంట్‌ ఉంది.తక్కువ వయసులోనే ఎక్కువ ప్రతిభ కనబరిచి టీం ఇండియాకు భవిష్యత్తు ఆశాకిరణంగా నమ్మకాన్నిచ్చాడు.గత ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టాడు.అదే ఫామ్‌ను ఈ ఐపీఎల్‌ లోనూ కొనసాగిస్తున్నాడు.అయితే మలుపంతా ఇక్కడే ఉంది.శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడిన మ్యాచ్‌లో…పంత్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్ చేసాడంటూ ఒక వీడియో బయటికి వచ్చింది.

పంత్ ముందే చెప్పేశాడు…

క్రీజ్‌లో రాబిన్‌ ఊతప్ప ఉన్నాడు.పంత్ తన కీపింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.ఆ సమయంలో బౌలర్‌ బంతి విసరక ముందే ఆ డెలివరీ బౌండరీని చేరుకుంటుందనీ,నాలుగు పరుగులొస్తాయనీ పంత్ అన్నాడు.నిజంగానే ఆ బంతిని ఊతప్ప ఫోర్‌గా మరల్చాడు.ఇదంతా వికెట్ల దగ్గర ఉన్న మైక్‌లో రికార్ట్ అయింది.ఆ వీడియో క్లిప్‌ను అందరూ షేర్‌ చేసి విమర్శల వర్షం కురిపించింది.అయితే ఈ వాదనల్ని బీసీసీఐ పూర్తిగా కొట్టిపారేసింది.వాటిలో వాస్తవం లేదని తేల్చేసింది. ‘రిషబ్ పంత్‌ అంతకముందు ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్‌‌కి ఆఫ్‌సైడ్ ఫీల్డర్లను పెంచమని చెప్పాడు.అలా అయితేనే ఆఫ్‌సైడ్ బౌండరీలని నిలువరించగమని పంత్‌ సూచించిన మాటలు ఎవరూ వినలేదు’అందుకే ఆ బంతి బౌండరీ అవుతుందని పంత్ చెప్పాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *