మహేష్ ఏఎంబీ సినిమాస్‌ చూశాక వర్మ ట్వీట్

మహేష్ ఏఎంబీ సినిమాస్‌ చూశాక వర్మ ట్వీట్

సూపర్‌స్టార్ మహేష్ కొత్తగా AMB సినిమాస్ ప్రారంభించి బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఆదివారం ప్రారంబించిన ఈ మల్టీప్లెక్స్ ప్రారంభ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా జరిగింది. అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లినట్టుగా ఉందని చెబుతున్నారు. మల్టీప్లెక్స్‌ను చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Mahesh babu AMB Cinimas

అయితే…ఈ మల్టీప్లెక్స్ గురించి ఆర్జీవి ట్వీట్ చేశారు. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక సమస్య ఉందని వర్మ అన్నాడు. ఇదివరకు మల్టీప్లెక్స్‌ చూడ్డానికి మహేష్‌లా అందంగా ఉందని ట్వీట్ చేసిన తను, ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత మరో ట్వీట్ చేశాడు. ” ఇపుడే AMB చూశాను. అయితే ఇందులో ఉన్న సమస్య ఏమిటంటే…ఈ సూపర్ మల్టీప్లెక్స్‌కు తగినట్టు సినిమాలు రావడం కష్టం. ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ ” అని ట్వీట్ చేశాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *