రేవంత్ రెడ్డి అరెస్ట్ …పోలీసులను నిలదీసిన రేవంత్ భార్య

రేవంత్ రెడ్డి అరెస్ట్ …పోలీసులను నిలదీసిన రేవంత్ భార్య

తెల్లవారుజామున ఎలాంటి సమాచారం లేకుండా ఇంటి తలుపులు పగలగొట్టి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారనేది విషయాన్ని రహస్యంగా దాచారు. ఈ విషయంపై ఆందోళనకు గురైన రేవంత్ భార్య తన భర్త ఆచూకి చెప్పాలని పోలీసులను అభ్యర్థించారు. ఇప్పటికీ ఆయన్ని తీసుకెళ్లి 13 గంటలు పైగా కావస్తున్నా ఏ విషయం చెప్పకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఉదయం నుంచి ఎవరిని అడిగినా ఎవరూ సరైన సమాధానం చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులపై అసహనం తెలిపినా…కనీసం ఎక్కడున్నారోనైనా చెప్పమని మీడియా ముందే పోలీసులను నిలదీశారు. 

ఈరోజు కోస్గిలో కేసీఆర్ బహిరంగా కారణంగా రేవంత్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కానీ ఎక్కడికి తీసుకెళ్లారనే విషయం మాత్రం బయటకు చెప్పడంలేదు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *