ఆర్‌బీఐను సమర్థించిన మాజీ గవర్నర్...

ఆర్‌బీఐను సమర్థించిన మాజీ గవర్నర్...

ఆర్‌బీఐకు పూర్తి సేచ్ఛ ఉండాలన్న వాదనకు ఆర్థిక వేత్త, గవర్నర్ రఘురామ్ రాజన్ మద్దతు ఇచ్చారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, లబ్ది పొందాలన్నా స్వతంత్రత ఉండాలన్నారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకుంటే ఈ వివాదం ఉండదని, ఓ ఆంగ్ల టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. “దేశం క్షేమం కోసం ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రాదాయాలను కాపాడాలి. వ్యవస్థలో నిధుల ప్రవాహానికి సమస్య ఏదైనా ఉంటే ఆర్‌బీఐ చూసుకుంటుంది. అవసరమైన ప్రైవేటు సంస్థలకు లిక్విడిటీ సమకూరుతుంది. అది మంచిపద్ధతి ” అని తెలిపారు.

నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నగదు లభ్యత విషయంలో ఆర్‌బీఐకీ, ప్రభుత్వానికీ నెల క్రితం వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే…ప్రభుత్వ వ్యవస్థలోకి మరిన్ని నిధులను రప్పించాలని కోరినప్పటికీ ఆర్‌బీఐ మాత్రం తనదైన శైలిలో పని చేస్తుంది.

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ప్రసంగంతో ఈ వివాదం బయటపడింది. ఆర్‌బీఐలో ప్రభుత్వ జోక్యం గురించి బయటపెట్టినందుకు ఆచార్యను రాజన్ అభినందించారు. అయితే, ఆర్‌బీఐ కూడా NBFCలకు నిధులు సమకూర్చాల్సిందని పరోక్షంగా ప్రభుత్వాన్ని సమర్థించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *