నిను వీడని నీడను నేనే విడుదల తేదీ ఖరారు

నిను వీడని నీడను నేనే విడుదల తేదీ ఖరారు

కొంతకాలంగా హిట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సక్సెస్ లేకపోయిన ఈ హీరో వరసగా సినిమాలు చేస్తున్నాడు. హిట్ కోసం ఆరాటపడుతున్న ఈ యంగ్ హీరో నిను వీడని నీడను నేనే అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.చూద్దాం….

కొంతకాలంగా హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు సందీప్ కిషన్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత ఈ యంగ్ హీరో చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తున్న సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. అయినా కూడా విజయం కోసం పట్టువీడని విక్రమార్కుడిలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఎంత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా కూడా ఈ కుర్ర హీరోకు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ప్లాప్‌లు తప్పడం లేదు. దీంతో నెక్స్ట్ సినిమాల విషయంలో కాస్త ఆచితూచి అడుగులేయడం మొదలెట్టాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

జి.నాగేశ్వ‌ర‌రెడ్డి డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లో పూర్తిస్థాయి వినోదాత్మ‌కంగా తెరకెక్కుతున్న తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కార్తీక్ రాజు దర్శకత్వంలో నిను వీడని నీడను నేనే మూవీ చేస్తున్నాడు. హారర్ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలతో తనకు కచ్చితంగా మంచి బ్రేక్ వస్తుందని నమ్మకంతో ఉన్నాడు సందీప్ కిషన్. మరి ఈ హీరో నమ్మకాన్ని ఈ సినిమాలు ఎంతవరకు నిలబెడుతాయో చూడాలి….

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *