వలసదారుల కష్టాలు...ట్రక్కుల్లో ఇరుక్కుని దేశం దాటే ప్రయత్నం!

వలసదారుల కష్టాలు...ట్రక్కుల్లో ఇరుక్కుని దేశం దాటే ప్రయత్నం!

మనదేశం మిగిలిన చాలా దేశాల కంటే ఎంతో సురక్షితం. ఎందుకంటే, ఇతర దేశాల్లోలాగా వలస వెళ్లి బ్రతకాల్సిన దుస్థితి లేదు. కొందరు గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్లినా కష్టంగా ఉంటే తిరిగి వచ్చేస్తున్నారు. లేదా కొన్నాళ్లు కష్టాలు పడి తిరిగి సొంత దేశానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ కాకుండా ఇతర దేశాల్లోనైతే వలసదారుల సంఖ్య చాలా ఎక్కువ. సరిహద్దుల్లో పోలీసుల కళ్లుగప్పి ఇంకో దేశంలోకి పారిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ప్రణాళికలు వేసుకుని చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటారు. కానీ అటువంటివి కనిపెట్టి పోలీసులు సైతం వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తుంటారు కూడా…! అలా మొరాకోలో కొందరు వలసదారులు కారు డ్యాష్‌బోర్డుల్లోనూ, ఇంగిన్ భాగంలోను పడుకుని వెళ్లిన సంఘటన ఇటీవల జరిగింది.

కొన్ని నెలల కిందట కొందరు వలసదారులు పరుపుల్లో దాక్కొని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. ఆ సంఘటన తర్వాత ఇటీవల మరో నలుగురు వలసదారులు కారు డ్యాష్‌బోర్డు, ఇంజిన్‌ల వద్ద పడుకుని పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన మొరాకోలోని బెని ఎన్సార్‌లో జరిగింది. తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసులు మూడు కార్లను నిలిపారు. వాటిని పరిశీలించగా కారు ముందు భాగంలో స్టీరింగ్ వద్ద ఉండే డ్యాష్‌బోర్డు, వెనుకవైపు సీట్లలో, ఇంజిన్‌ల మధ్య ఇరుక్కుని మరీ దాక్కున్న వలసదారులు కనిపించారు. నలుగురు వలసదారుల్లో 15 ఏళ్ల బాలిక కూడా ఉండటం విశేషం.

ఇలా ఇరుక్కుని ప్రయాణం చేయడం వల్ల వారికి నొప్పి కలగకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే మెలిలా నగరంలో నిర్వహించిన తనిఖీల్లో ఒక వ్యక్తిని ఏకంగా ట్రక్కు అడుభాగంలో వేలాడుతూ సరిహద్దు దాటాలని ప్రయత్నం చేశాడు. అయితే, ఆ విషయం డ్రైవర్‌కు తెలీదని, అతడు లేని సమయంలో ట్రక్ కిందకు చేరి దానికి వేలాడేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *