చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గింపు ...

చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గింపు ...

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జడ్ కేటగిరి భద్రత కలిగి ఉన్న చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది . లోకేష్‌కు 2+2 గన్‌మెన్లను కేటాయించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లోకేశ్‌కు 5+5 భద్రత ఉండేది. అదే సమయంలో లోకేష్‌ను మినహాయిస్తే మిగిలిన కుటుంబసభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. చంద్రబాబు విదేశీ పర్యటనను ముగించుకుని రాగానే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం టీడీపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది .

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కనీస సమాచారం ఇవ్వకుండా భద్రత ఎలా తొలగిస్తారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం భద్రత విషయంలో ఎక్కడా పక్షపాతం చూపలేదని, కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి రాగానే చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ విమర్శించింది.

వైసీపీ మాత్రం టీడీపీ వాదనను కొట్టిపడేస్తోంది . అధికారంలో ఉన్నప్పుడు ఉన్న భద్రత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందని వైసీపీ నాయకులూ టీడీపీని ప్రశ్నిస్తున్నారు . ప్రతిపక్ష నాయకుడి భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదంటున్నారు .టీడీపీ నేతలది అనవసర రాజకీయమని విమర్శిస్తున్నారు . జగన్ పై దాడి జరిగినప్పుడు అవహేళన చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు .

మొత్తానికి ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం , చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గించడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది . ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడు ఈ వివాదం ఉత్పన్నమవుతుంది . అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడి భద్రత ప్రభుత్వం బాధ్యత . అంతేకాదు అవసరాన్నిబట్టి భద్రతా విషయంలో ఎలాంటి రాజీ లేకుండా భద్రతను తగ్గించే , పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది .

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *