మరోసారి అదరగొట్టేందుకు... రెడ్‌మీ రెడీ

మరోసారి అదరగొట్టేందుకు... రెడ్‌మీ రెడీ

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ దూసుకెళ్తోంది. తక్కువ ధరకు, ఎక్కువ ఫీచర్లను అందిస్తూ అందర్నీ అలరిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి వారూ, యువతా… ఈ స్మార్ట్‌ ఫోన్లను కొనడాకికే ఇష్టపడుతున్నారు. షావోమీ కూడా ఎప్పటిప్పుడు అప్‌డేట్‌ అవుతూ… ఫ్లాష్‌ సేల్స్‌ నిర్వహిస్తూ, వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ‘రెడ్‌మి 6ఎ’ ఫోన్లతో మరోసారి వినియోగదారుల ముందుకొచ్చింది.

Red Mi 6a Offers

నవంబర్‌ 14న ఫ్లాష్‌ సేల్‌

“రెడ్‌మీ 6ఎ” ఫోన్లను నవంబర్‌ 14 నుంచి అందుబాటులోకి తెస్తుంది. అఫీషియల్‌ సైట్‌తో పాటు, అమెజాన్‌ లోనూ వీటిని పొందొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండీ… ఈ ఫ్లాష్‌ సేల్ మొదలైంది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో లభ్యమవుతున్న ఈ ఫోన్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఆమోజాన్‌ ద్వారా ఈ ఫోన్‌ కొంటే… 2,200 రూపాయాల క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. దాంతో పాటు 100 జీబీ జియో డేటానూ అందిస్తున్నారు.

కొద్దిగా పెరిగిన ధరలు…

ఈ ఫోన్ల ధరలు కొద్దిగా పెరిగాయి. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్‌ రూ.6,599కి లభ్యమవుతోంది. ఇక 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్‌ రూ.7,499కి లభ్యమవుతోంది. ఫీచర్లు కూడా బాగానే ఉన్నాయి. 5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 1 ఆపరేటింగ్‌ సిస్టంతో, హీలియో ఏ22 ప్రాసెసర్‌తో, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో, 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో… ఈ ఫోన్లు వినియోగదారులను బాగానే అకట్టుకుంటున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *