డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు.. కర్నూలులో రేవ్ పార్టీ కలకలం

డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు.. కర్నూలులో రేవ్ పార్టీ కలకలం

కర్నూలులో రేవ్ పార్టీ కలకలంరేపింది. దీపావళి సందర్భంగా గురువారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఓ ఫెర్టిలైజర్ కంపెనీ ఏజెంట్లు పార్టీ ఏర్పాటు చేశారు. మందు, విందుతో పాటూ డ్యాన్సర్లను తీసుకొచ్చి చిందులేశారు. మద్యం మత్తులో ఏజెంట్లు డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో నిర్వాహకులు.. యువతుల మధ్య వాగ్వాదం నడిచింది. తర్వాత ఆ డ్యాన్సర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Recording Dance in Kurnool

ఈ పార్టీ, డ్యాన్స్ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పోలీసుల దగ్గరకు చేరింది. వెంటనే రంగంలోకి దిగి.. పార్టీ జరిగిన ఫంక్షన్ హాలుకు వెళ్లి ఆరా తీశారు. కేసు నమోదు చేసి నిర్వాహకులను గుర్తించే పనిలో ఉన్నారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *