రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ VS కోల్‌కతా నైట్ రైడర్స్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ VS కోల్‌కతా నైట్ రైడర్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న పదిహేడో మ్యాచ్‌లో బెంగుళూరు వేదికగా ఈ రోజు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌ తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్‌ VS కోల్‌కతా నైట్ రైడర్స్‌… బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ స్వతహాగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ ఆసాంతం పరుగులు రాబట్టటానికి ఎలాంటి డోకానూ ఉంటుంది. సీమర్లకూ, స్పిన్నర్లకూ ఒకింత ఇబ్బందిగానే ఉంటుంది. బౌండరీలూ దగ్గరిగానే ఉంటాయి. ఈ రోజు భారీ స్కోర్లు చూసే అవకాశం ఉంది.

170 దాటినా కష్టమే

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్‌ స్వభావాన్ని బట్టి హై స్కోరింగ్‌ మ్యాచ్‌గా మిగిలే అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 170 పరుగులు చేసినా… ప్రత్యర్థి జట్టును అడ్డుకోవడం కష్టమే అవుతుంది. 180 పరుగులు చేసినా… సేఫ్ టార్గెట్ అనుకోవడానికి లేదు. 200 పైచిలుకు పరుగులు చేస్తేనే ప్రత్యర్థిజట్టు మీద ఒత్తిడి పెంచొచ్చు. భారీ హిట్టర్లే మ్యాచ్‌ విన్నర్లు. ఈ రెండు జట్లనూ పోల్చిచూస్తే… భారీ హిట్టర్లు కోల్‌కతా వైపే ఎక్కువగా ఉన్నారు. కోల్‌కతాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్‌ బ్యాటింగ్ చేసేవారికీ విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *