త్వరలోనే డైరెక్టర్‌గా మారబోతున్న హీరో

త్వరలోనే డైరెక్టర్‌గా మారబోతున్న హీరో

మాస్ ఎంటర్ టైనర్స్‌కి పెట్టింది పేరు మాస్ మహారాజా రవితేజ. ఒకప్పుడు బాక్సాఫీస్‌కి హాట్ ఫేవరేట్ అయిన ఈ మాస్ హీరో వరస సినిమాలతో మాస్ ఆడియన్స్‌ని అలరించాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తే అందులో కనీసం ఒకటైనా గ్యారంటీ హిట్ అయ్యేది. అయితే ఇదంతా ఒకప్పటి ట్రాక్ రికార్డ్. ఇప్పుడు మాత్రం సీన్ రివర్సయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న రవితేజకు కొంతకాలంగా విజయం మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. టూ ఇయర్స్ గ్యాప్ తరువాత చేసిన రాజా ది గ్రేట్ మూవీతో సక్సెస్ అందుకున్నాడు.ఈ మూవీ ఇచ్చిన ఎనర్జీతో మళ్లీ వరస సినిమాలు చేసిన మునుపాటి లాగే మళ్లీ ప్లాప్‌ల బాట పట్టాడు.ఇటీవలే వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ బిగేస్ట్ డిజాస్టర్ అయింది.దీంతో ఈహీరో కెరీర్ కాస్త డైలమాలో పడింది.
Raviteja next movieప్ర‌స్తుతం వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో డిస్కో రాజా అనే మూవీ చేస్తున్నాడు.దీంతోపాటు తమిళ హిట్ మూవీ తేరికి రీమేక్‌గా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమాకు క‌న‌క‌దుర్గ అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌.అయితే ఈ సినిమా తరువాత నటనకు రిటైర్మెంట్ ఇచ్చి దర్శకుడిగా మారబోతున్నాడట ర‌వితేజ. ఇటీవ‌ల క‌ళ్యాణ్ రామ్‌ని క‌లిసిన ఈ మాస్ హీరో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని వినిపించాడని సమాచారం.కథకు కనెక్ట్ అయిన క‌ళ్యాణ్ రామ్‌ కూడా వెంటనే ఓకే చెప్పాడట.హీరోగా నటిస్తూ ఈ సినిమాని నిర్మించబోతున్నాడని టాలీవుడ్ జంక్షన్‌లో గట్టిగానే వినిపిస్తోంది.మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *