కోలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక

కోలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కిట్టీ పార్టీతో సొంత భాషలో స్టార్ డం దక్కించుకుంది..ఛలో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం చిత్రంతో స్టార్ డం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒక వైపు తెలుగులో వరుసగా చిత్రాల్లో నటిస్తూ కన్నడంలో కూడా అడపా దడపా చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ రష్మిక కోలీవుడ్ తన హావా కొనసాగించాలని భావిస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీకి తనని పిలవడం చాలా సంతోషంగా ఉందని చెబుతుంది ఈ బ్యూటీ


తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అయ్యింది. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కార్తీకి జోడీగా నటిస్తోంది. రీసెంట్‌గా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ ఉండబోతుందని తెలుస్తోంది.ఈ సినిమా సక్సెస్ అయితే రష్మికకు తమిళనాట కూడా మంచి క్రేజ్ దక్కడం ఖాయం. దాంతో కన్నడం తెలుగు తమిళంలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా అరుదైన రికార్డు దక్కించుకునే అవకాశం ఉంది. మరి కోలీవుడ్‌లోనూ రష్మిక సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *