'సరిలేరు నీకెవ్వరు' నుండి ఆమె అవుట్....?

'సరిలేరు నీకెవ్వరు' నుండి ఆమె అవుట్....?

మహర్షితో కాసుల వర్షం కురిపించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ… సరిలేరు నీకెవ్వరు. రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అనుకుంటున్న టైములో చిత్ర యూనిట్ నుంచి లీక్ అయిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది… అదేంటో మీరూ చూడండి

సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమాగా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చాలారోజుల తరువాత మహేష్ బాబు సినిమాల్లో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ రూపొందబోతున్న ఈ సినిమాను ముగ్గురు కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ నటి మరియు లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి ఒక మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

ఇక సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అనుకుంటున్న టైములో సరిలేరు నీకెవ్వరూ చిత్రయూనిట్ నుంచి బయటకి వచ్చిన ఒక వార్త… ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అది ఏమిటంటే, ఈ సినిమా నుండి హీరోయిన్ రష్మిక తప్పించారట… నిజానికి మొదటినుండి తమ హీరో మహేష్ బాబు సరసన రష్మిక వద్దని, మహేష్ ముందు ఆమె మరీ తేలిపోయినట్లు ఉంటుందని ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు. కొంతమంది సన్నిహితులు కూడా రష్మిక, మహేశ్ పక్కన సరిపోదేమో అనే కామెంట్స్ చేయడంతో… ఆలోచనలో పడ్డ దర్శక నిర్మాతలు ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త పై సరిలేరు నీకెవ్వరు టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం బయటకి రాలేదు. మరి వార్త నిజామా లేక రూమర్ మాత్రమేనా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *