పసిమొగ్గలపై పైశాచికత్వమా!

పసిమొగ్గలపై పైశాచికత్వమా!

నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేవు అంటూ కామాంధులు రెచ్చిపోతున్నారు. మంచి, మానవత్వం, పాపం, పుణ్యం ఏమీ లేదు. ఆడపిల్ల కనిపిస్తే ఆంబోతుల్లా మీదపడుతున్నారు. తమ కోర్కెల్ని తీర్చుకోవడానికి పావులా వాడుకుంటున్నారు. ఇంగిత జ్ఞానాన్ని మరుస్తున్నారు. పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఓ కామాంధుడు పసి పాపపై అత్యాచారానికి తెగబడ్డాడు. అసలు చిన్నారులపై ఎందుకీ పైశాచిక దాడులు చోటు చేసుకుంటున్నాయి?

పాపం,పుణ్యం తెలియని పసి మొగ్గలపై జరుగుతున్న లైంగిక దాడులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మనం నిజంగా నాగరిక సమాజంలోనే ఉన్నామా అనే ప్రశ్నలతో మనసులను కల్లోల పరుస్తున్నాయి. చిన్నారులపై ఈ లైంగిక వేధింపుల వార్తల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఏం జరుగుతుందో తెలియక, ఏం జరిగిందో వ్యక్తం చేయలేని చిన్నారి మనస్సులు ఇటువంటి సంఘటనల వల్ల ఎంత భయాందోళనలకు గురవుతున్నాయో ఊహించటానికే భయంతో గుండె వేగం పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా వికృత చేష్టకు పాల్పడ్డాడు ఓ కామాంధుడు.కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో 8 సంవత్సరల చిన్నారిపై సుమన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.

తన ఇంటి వద్ద ఆడుకోవడానికి వచ్చిన పాపకు కూల్ డ్రింక్ లో విస్కీ కలిపి తాగించి, ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడు సుమన్ పై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే కొందరు అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. విషయం బయటకు పొక్కడంతో శీలానికి వెల కట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, పోలీసులు ఒక పక్క ఫిర్యాదు రాలేదని చెప్పిన సందర్భంలో నిందితుడు సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా ఏకమై సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సుమన్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఏదేమైనా .. ఎన్ని చట్టాలు వచ్చిన ….ఎవరెన్ని రకాలుగా కృషిచేసినప్పటికీ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఆగటం లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *