అచ్చం కపిల్‌లానే.! ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్

అచ్చం కపిల్‌లానే.! ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్

సినీ,రాజకీయ,క్రీడా రంగాల్లోనే కాదు ఇతర రంగాల్లో తమదైన ముద్రవేసిన వారి బయోపిక్ లు రూపొందిస్తున్నారు దర్శక,నిర్మాతలు. ఇలాంటి సినిమాలకు మంచి క్రేజ్ రావవడం విశేషం. భారతీయ క్రికెట్ రంగంలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న కపిల్ దేవ్ జీవితంపై ఓ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే.

కపిల్ దేవ్ పాత్రలో నటించబోతున్నది బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ హిందీ,తెలుగు లో రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా ఈ మూవీలో కపిల్ దేవ్ గా నటిస్తున్న ర‌ణ్‌వీర్‌ సింగ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో కపిల్ దేవ్ సతీమణిగా దీపిక నటిస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *