కంగనాకు అది లేకుండా నిద్ర పట్టదా ?

కంగనాకు అది లేకుండా నిద్ర పట్టదా ?

బాలీవుడ్ క్వీన్ కంగనా కొత్త పంచాయితీ కొని తెచ్చుకుంది. కాంట్రవర్సీల్లోకి కంగనే వెళ్తుందో లేక కాంట్రవర్సీలే కంగనాను చుట్టుముడుతున్నాయో తెలియదుగాని ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ లో నిలుస్తునే ఉంటుంది. ఈ బ్యూటీ వ్యవహారం చూస్తుంటే కావాలనే ఇతరుల జోలికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరో ఒకరి పైన కామెంట్స్ చేస్తే గాని నిద్ర పట్టదనుకుంటా. ఇటీవలే ఓ ఇంటర్య్వూ లో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ బాధ్యత లేని వ్యక్తి అంటూ హాట్ దేవ ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే లగ్జరీ లైప్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ప్రజా సమస్యలపై ఎప్పుడు మాట్లాడేందుకు ఇష్టపడడు. కానీ నేను అలాంటి వ్వక్తిని కాదు అంటు కామంట్ప్ చేసింది.

కంగనా కామెంట్ప్ రణబీర్ ఘటుగానే సమాధానం ఇచ్చాడు.తనకు ఎవరి నుంచైనా ప్రశ్నలు ఎదురైతే కచ్చితంగా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాని. కానీ, రాజకీయాల గురించి మాట్లాడాలనే అసలు ఇష్టం ఉండదని, అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవడం అసలుకే ఇష్టం ఉండదని,. దేని గురించి మాట్లాడాలి అనే విషయంలో తనకు ఫుల్ క్లారిటీ ఉందని, అనవసరంగా ఎవరి పై పడితే వారిపై కామెంట్స్ చేయడం నచ్చదు అంటు సమాధానం ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే తనకు నోటి దురుసు లేదంటు చెప్పకనే చెప్పాడు . మరి రణబీర్ వ్యాఖ్యలపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *