శరవేగంగా జరుగుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్

శరవేగంగా జరుగుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్
ఎవరేమన్నా ఎంత తిట్టి పోసినా తన మానాన తాను సినిమాలు తీస్తూ ఇష్టం ఉంటే చూడండి లేదంటే మానేయండి అంటూ చెప్పుకునే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీ విషయంలో గత కొద్ది రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నాడో చూస్తున్నాం. షూటింగ్ వేగవంతంగానే జరుగుతోంది. ఈ మధ్య కీలకమైన సన్నివేశాల తాలుకు పిక్స్ కూడా పోస్ట్ చేస్తున్నాడు వర్మ. ఏ క్యారెక్టర్ ని ఎవరు చేస్తున్నారనేది అనేది కూడా రివీల్ చేసిన వర్మ, బాబుని టార్గెట్ చేసి ప్రొమోషన్స్ జరుపుతున్నారు. అయితే ప్రేక్షకుల గురించి కాసేపు పక్కన పెడితే వర్మ తిక్కకి లెక్క చెప్పే వాళ్లు లేరా అంటే ఉన్నారు. వాళ్లే సెన్సార్ బోర్డ్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విలన్ గా చిత్రీకరిస్తూ ఎప్పుడో జరిగిన సంఘటనలను చూపిస్తే అబ్జెక్షన్ చేయకుండా ఉండదు. సెన్సార్ బోర్డ్ వరకూ వెళ్తే మాత్రం వర్మ సినిమాకి కోతలు మాత్రం తప్పవు.

సెన్సార్ కట్స్

ఇదే జరిగితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి పెద్ద నష్టం జరిగినట్లే, అయితే ఎప్పుడూ కొంచెం తేడాగానే ఆలోచించే వర్మ తలుచుకుంటే సెన్సార్ బోర్డ్ కోతలనే పబ్లిసిటీగా మార్చుకోగలడు. టీడీపీ గవర్నమెంట్ లోనే ఉంది కాబట్టి తన సినిమాని అడ్డుకుంటున్నారని, కావాలనే కోతలు వేశారని వర్మ పబ్లిసిటీ చేసుకోగలడు. ఇదే జరిగితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ఇప్పుడున్న పబ్లిసిటీ కన్నా సెన్సార్ కట్స్ ద్వారా వచ్చే పబ్లిసిటీనే ఎక్కువ. ఇదే జరిగితే వర్మ కన్నా హ్యాపీగా ఉండే వాళ్లు ఎవరు ఉండరు. పబ్లిసిటీని పీక్ స్టేజ్ లో కోరుకునే వర్మకి సెన్సార్ బూస్ట్ ఎంత వరకూ అందుతుందో చూడాలి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *