‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ

‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ

రంగస్థలం సినిమాతో 200 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ తేజ్, మెగా పవర్ స్టార్ అనే బిరుదుకి న్యాయం చేశాడు. ఈసారి బోయపాటి శ్రీనుతో కలిసి సినిమా చేస్తున్నాడు అనగానే, రామ్ చరణ్ కెరీర్ లో  మరో బిగ్గెస్ట్ హిట్ పడబోతుందని అందరూ అనుకున్నారు. సాఫ్ట్  టైటిల్ తో, ఊరమాస్ పోస్టర్స్ తో అంచనాలు పెంచిన ఈ ఇద్దరు మరి ఆ అంచనాలనిబోయపాటి చరణ్  అందుకున్నారో లేదో చూద్దాం.

vinaya vidheya rama review

కష్టం వచ్చినా

ఒక రెగ్యులర్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నలుగురు ఆనాధలు, వారికి దొరికిన తమ్ముడు. మొత్తం అయిదు మందిని ఒక పెద్దాయన చేరదీస్తాడు, ఆయన దగ్గరే పెరిగి పెద్దయిన ఈ పంచపాండవుల్లో చివరి వాడు నలుగురు అన్నల చదువుల కోసం త్యాగం చేసి కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడే చిన్నోడు, తన ఫ్యామిలీకి ఒక చిన్న సైజు నియంత లాంటి వ్యక్తి నుంచి వచ్చిన సమస్యని ఎలా  సాల్వ్ చేశాడు అనేదే ఈ సినిమా కథ. అయిదుగురి అన్న దమ్ముల్లో పెద్దవాడిగా భువన్ కుమార్ పాత్రలో ప్రశాంత్ కనిపిస్తాడు, బై ప్రొఫెషన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన భువన్… ఎక్కడ సమస్యాత్మక ఎన్నికలు ఉన్నా స్పెషల్ ఎలెక్షన్ ఆఫీసర్ గా వెళ్లి ఎన్నికలని ప్రశ్నతంగా పూర్తి చేసుకొని వస్తాడు, ఒకవేళ అక్కడి వారి వలన తనకీ, తన కుటుంబానికి ఏదైనా సమస్య  వస్తే కాపాడడానికి తమ్ముడు ఎలాగూ ఉన్నాడు కదా… అయితే ఎన్నికల అధికారిగా వైజాగ్ వచ్చిన భువన్ కి, పందెం పరశురామ్ అనే లోకల్ రౌడీతో సమస్య వస్తుంది…   దీని నుంచి రామ్ కొణిదెల అతని అన్నని కాపాడి, వైజాగ్ ఎలెక్షన్స్ ని సజావుగా సాగించడంలో భువన్ కి అండగా నిలబడతాడు. ఇదే క్రమంలో భువన్ ఈసరి హింసాత్మక ప్రాంతమైన బీహార్ కి ఎన్నికల అధికారిగా వెళ్తాడు. అక్కడ చిన్న సైజు నియంతలా ఉండే రాజు భాయ్ దే రాజ్యం, అతను చెప్పిందే వేదం, ఎదిరిస్తే చంపేస్తాడు. ఇలాంటి పరిస్థితిలో భువన్ కి రాజు భాయ్ నుంచి వచ్చిన  సమస్యలు ఏంటి? ఎప్పుడూ కుటుంబాన్ని కాపాడుకునే రామ్, ఈసారి కూడా కాపాడుకున్నాడా లేదా అనేదే వినయ విధేయ రామ కథా కథనం.

vinaya vidheya rama review

చరణ్ ది బెస్ట్

పేరుకే ఈ సినిమా వినయ విధేయ రామ కానీ ఇందులో రామ్ క్యారెక్టర్ కి వినయం, విధేయత అస్సలు లేదు. తన ఇంటి జోలికి ఎవరు వచ్చిన కొట్టడమో చంపడమొ మాత్రమే అతనికి తెలిసిన పని, ఇలాంటి పాత్రలో కనిపించిన రామ్ చరణ్ తేజ్ కి నటించడానికి  స్కోప్ లేదు, వేరియేషన్స్ చూపించే అవకాశం అసలే లేదు. యాక్షన్ ఎపిసోడ్స్ లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ, డాన్సుల్లో కానీ  చరణ్ ది బెస్ట్ ఇచ్చాడు. అయితే అతనికి నటించే స్కోప్ ని ఇచ్చే దమ్ము కథలోనే లేదు. మిగిలిన నలుగురు అన్నల్లో చాల కాలం తర్వాత తెలుగు తెరపై  మెరిసిన ప్రశాంత్, డీసెంట్ రోల్ ప్లే చేశాడు… ఇంటి పెద్దగా, స్ట్రిక్ట్ ఆఫీసర్ గా మంచి నటన చూపించాడు. ఇక ఈ అన్నలకి వదినలు పాత్రల్లో స్నేహ తప్ప మిగిలిన వాళ్ల గురించి మాట్లాడుకోవడానికేమి లేదు. తనకి ఇచ్చిన పాత్రకి,  పూర్తిగా న్యాయం చేసింది. ఆ తర్వాత మొదటి సినిమాతో మంచి నటనతో మెప్పించిన కియారా అద్వానీ, వినయ విధేయ రామ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించిన కియారా, చేయడానికి  మాత్రం ఏమి లేదు. కేవలం పాటల కోసం మాత్రమే కియారాని తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇక చివరగా కచ్చితంగా చెప్పుకోవాల్సింది వివేక్ ఒబెరాయ్ గురించి, స్క్రీన్ పై కనిపించేది కాసేపే అయినా వివేక్ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. విలనిజంని బాగా ప్రెజెంట్ చేశాడు, ఇలానే సినిమాలు చేయడం కంటిన్యూ చేస్తే వివేక్ ఒబెరాయ్ తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మంచి స్టైలిష్ విలన్ అవుతాడు. 

vinaya vidheya rama review

ఊరమాస్

సాంగ్స్ తోనే కొంత వరకూ నిరాశపరిచిన దేవి శ్రీప్రసాద్, నేపధ్య సంగీతంతో పర్వాలేదని పించాడు, అక్కడక్కడా బీజీఎమ్ బాగా లేవపాడం తప్ప దేవి వలన వినయ విధేయ రామ సినిమాకి ఒరిగిందేమి లేదు, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, ముఖ్యంగా యాక్షన్ సీక్వెస్ వచ్చే సమయంలో కెమెరా వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కథకి అవసరమైన దాయానికన్నా మితిమీరిన ఖర్చు కనిపిస్తుంది. ఇక చరణ్ లాంటి హీరో, బోయపాటికి దొరికితే ఎలా ఉంటుందో అని ఆలోచన నుంచి పుట్టిన భారీ అంచనాలని మోసిన బోయపాటి, వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. పసలేని కథ, విషయం లేని కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి, చరణ్ తో డైలాగులు, ఫైట్లు చేయించడం తప్ప బోయపాటి పెద్దగా చేసిందేమి లేదు. ఊరమాస్ అనే మాటనే ఇంటి పేరుగా మార్చుకున్న బోయపాటి శ్రీను నుంచి ఇంత కన్నా ఎక్కువగా ఆశించడం తప్పేమో అనిపించక మానదు. మాములుగా బోయపాటి శ్రీను సినిమాల్లో ఎన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా జస్టిఫై చేసే సీన్స్ ఉంటాయి, హీరోని అద్భుతంగా ఎలివేట్ చేసే ఎమోషన్స్ ఉంటాయి కానీ అవన్నీ వినయ విధేయ రామ సినిమాలో లేవు. అసలు వినయ విధేయ రామ అనే టైటిల్ ఎందుకు పెట్టాడో కూడా తెలియదు, అది కాస్త మార్చి విధ్వంస రామ… వీర రామ అని పెట్టిన పక్కా కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ అన్నా ఉండేది. పసలేని కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ కి కలిపే ప్రయత్నం చేసినా కూడా అది పూర్తిగా తాకినట్లు కాకుండా అక్కడక్కడా తేడా కొడుతుంది, మాస్ హీరో అంటే ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి, ఓపెనింగ్ ఫైట్ ఉండాలి కానీ అవి కథలో భాగమవ్వాలి అప్పుడే దానికో అర్ధం ఉంటుంది. అంతేకాని ఫస్ట్ ఫైట్ చూపించాలికాబట్టి ఎత్తుకోవడమే ఎక్కడో ఒక యాక్షన్ నుంచి ఎత్తుకొని, కట్ చేస్తే నెక్స్ట్ రెండు సీన్ల తర్వాత ఓకే సాంగ్ ఉండాలి, డాన్స్ వేయించాలి కాబట్టి ఒక క్యారెక్టర్ ని పెట్టి… సాంగ్ ని ఇరికించి చేయడం అసలు కథనంలో పొదిగినట్లు అనిపించదు. మూడు ఫ్యామిలీ సీన్లు, ఒక ఫైట్ సీన్, ఒక విలన్ సీన్, మధ్యలో ఒక పాట… ఇదే రిపీట్ మోడ్ లో చూసినట్లు ఉంటుంది. అయితే బోయపాటి సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించేది ఇదే అయినా కూడా వాటిలో చాలా దమ్ముండెది, హీరో విలన్ మధ్య వచ్చే కన్ఫరెంటేషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి కానీ వినయ విధేయ రామ సినిమాలో అవేమి కనిపించవు. మితిమీరిన హింస, అర్ధం పర్థంలేని కథనంతో అసలు ఇది బోయపాటి సినిమానేనా అనిపిస్తుంది. ముఖ్యంగా బోయపాటి ట్రైలర్ మార్క్ యాక్షన్ సీన్స్ వినయ విధేయ రామాలో చాలా నార్మల్ గా అనిపిస్తాయి, అజార్భైజాన్ ఎపిసోడ్, చరణ్ టాటూ అవుతుంది అనుకుంటే లాస్ట్ కి అది ఊహించిన రేంజులో లేక నిరాశ పరుస్తుంది. ఒక ట్రైన్ సీక్వెన్స్, నరికితే తలలు తెగిపడే సన్నివేశాలైతే కామెడీగా, అసలు ఆడియన్స్ ని ఏమనుకుంటున్నారో అనే ఫీలింగ్ కదులుతుంది. ఇంతకన్నా చెప్తే బాగోదు కాబట్టి సింపుల్ గా చెప్పాలి అంటే చరణ్ లాంటి హీరో దొరికితే ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిన బోయపాటి శ్రీను… ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *