సీనియర్ హీరోలతో నటించడానికి రెడీ అవుతున్న రకుల్

సీనియర్ హీరోలతో నటించడానికి రెడీ అవుతున్న రకుల్

చిన్న సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పంజాబీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఎంత వేగంగా స్టార్‌ ఇమేజ్‌ సాధించిందో అదే వేగంగా తన ఫాం కోల్పోయింది. రామ్ చరణ్‌తో నటించిన ధృవ సినిమాతో బిగ్‌ హిట్ అందుకున్న రకుల్‌ తరువాత టాలీవుడ్ లో మరో హిట్అందుకోలేకపోయింది. దీనికి తోడు బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేసిన ఈ బ్యూటీ అక్కడ కూడా ప్లాప్‌లు అందుకుంది. ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో సినిమాలు లేకపోవడంతో అమ్మడి కెరీర్ కాస్త కష్టాల్లో పడింది.

Rakul in Manmadhudu 2

టాలీవుడ్‌కు దూరంగా

ఈ మధ్యకాలంలో కోలీవుడ్ సినిమాలు చేసున్న అక్కడ కూడా ఆశించిన స్థాయి సక్సెస్‌లు దక్కకపోవటంతో రకుల్ తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉండటంతో ఆఫర్లు తగ్గాయి. స్టార్ హీరోలు కూడా రకుల్‌ని సైడ్ చేస్తు కియారా అద్వాణీ, పూజా హెగ్డేలతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో తిరిగి ప్రూవ్ చేసుకునేందుకు సీనియర్ల సరసన నటించేందుకు కూడా ఓకె అంటుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మన్మథుడు 2లో నాగార్జున సరసన నటించేందుకు రకుల్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా రకుల్‌ తిరిగి ఫాంలోకి వస్తుందేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *