'రాక్షసుడు' రిలీజ్ డేట్ ఫిక్స్...

'రాక్షసుడు' రిలీజ్ డేట్ ఫిక్స్...

బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శ్రీను తరువాత సక్సెస్ అందుకోలేకపోతున్న హీరో సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాక్షసుడు… టీజర్ తో మెప్పించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి వాటిని కాష్ చేసుకోని ఈసారైనా హిట్ అందుకోవాలని చూస్తున్న సాయి శ్రీనివాస్… రాక్షసుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న రీమేక్‌ మూవీ రాక్షసుడు. తమిళ్‌లో ఘన విజయం సాధించిన రాక్షసన్‌ సినిమాను రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్‌ అయిన రాక్షసుడు టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది.గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాల హిందీ డబ్బింగ్‌ వర్షన్‌లు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్‌ సాధించాయి. దీంతో రాక్షసుడు హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ కోసం 12.5 కోట్లు ఆఫర్‌ చేశారు. కంటెట్‌పరంగా కూడా యూనివర్సల్‌ అప్రోచ్‌ ఉంటుందన్న నమ్మకంతో భారీ ఆఫర్‌లు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా తెలుగు శాటిలైట్‌ రైట్స్‌ కూడా 6 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాలు తమిళ ఒరిజినల్‌ వర్షన్‌లో చిత్రీకరించినవే వాడుతున్నారు. కేవలం హీరో హీరోయిన్లు కనిపించే సీన్స్‌ను మాత్రమే రీ షూట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ‘రాక్షసుడు’ చిత్రం, సింగిల్‌ షెడ్యూల్‌లో దాదాపు 85రోజుల పాటు షూటింగ్‌ జరుపుకొని, జులై 18న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయింది. మరి ఈ సినిమాతో అయిన సాయి శ్రీనివాస్‌ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *