‘పేట’ మూవీ రివ్యూ

‘పేట’ మూవీ రివ్యూ

సూపర్ స్టార్ రజినీకాంత్ స్పీడ్ పెంచి వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఆయన రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కూడా పోవడంతో రజినీ మార్కెట్ పూర్తిగా దెబ్బతింనింది. ఇలాంటి సమయంలో రజినీ… తన ఫ్యాన్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి పేట సినిమాని చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ అంతా వింటేజ్ రజినీని గుర్తు చేయడంతో, ఈ మూవీతో సూపర్ స్టార్ సూపర్ హిట్ అందుకుంటాడని అందరు అనుకున్నారు. తెలుగు సినిమాలకి పోటీగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన పేట కథ కథనాల్లోకి వెళితే… ఇదో కల్ట్ రజినీ సినిమా.

పేట ఊరమాస్

డార్జిలింగ్ లోని ఒక కాలేజ్ బాయ్స్ హాస్టల్ కి వార్డెన్ గా చేరిన కాళీ… అప్పటికే లోకల్ కుర్రాళ్లతో పాడైన ఆ హాస్టల్ ని, హాస్టల్ లోని సమస్యలని కాళీ ఎలా సాల్వ్ చేశాడు.. ఈ క్రమంలో లోకల్ గుండాలతో  కాళీకి గొడవ జరుగుతుంది… అయితే ఈ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్‌ నుంచి అక్కడకు వచ్చాడనే విషయం బయట పడుతుంది. అసలు ఈ పేట ఎవరు? ఆతను కాళీగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేదే ఈ చిత్ర కథ. ఇందులో కాళీ పాత్రలో కనిపించిన రజినీకాంత్, తనకి మాత్రమే సాధ్యమైన స్టైల్ తో స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించాడు. పేట ఊరమాస్ గా కనిపిస్తూనే, కాళీగా తన మార్క్ మ్యానరిజమ్స్ తో విజిల్స్ వేయించాడు. ఇంకో ఐదేళ్లు అయినా తనలోని ఈజ్ తగ్గదని నిరూపించిన రజినీకాంత్, పేట సినిమాతో వింటేజ్ రజినీకాంత్ ని గుర్తు చేశాడు.

peta movie review

విజయ్ సేతుపతి

మిగిలిన పాత్రల్లో నటించిన వారిలో నవాజుద్దిన్ సిద్దిఖీ బాష రాకున్నా కూడా అద్భుతంగా నటించాడు. భయం, క్రూరం కలిసిన పాత్రని నవాజుద్దిన్ చాలా ఈజీగా నటించాడు… ఇక కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి పేట సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు. రజినీకి, సేతుపతికి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి, ఇక్కడి ఆడియన్స్ అలరించిన ఈ సీన్స్ అక్కడి సినీ అభిమానులతో విజిల్స్ వేయించి ఉంటుంది. ఆ తర్వాత సినిమాలో చెప్పుకోవాల్సిన పాత్ర ఏదైనా ఉందా అంటే శశి కుమార్, సనత్ లు బాగా నటించారు. పేరుకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కూడా రజినీ పక్కన కనిపించలేదు. మెగా ఆకాష్ ఉన్నంతలో స్క్రీన్ పైన అందంగా తన పాత్ర వరకూ చేసుకొని వెళ్లిపోయింది. ఎంతమంది తెరపై కనిపించినా కూడా రజినీ మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం పేట ప్రత్యేకత.
peta movie review

క్యూరియాసిటీ

మ్యూజిక్ డైరెక్టర్ గా అదిరిపోయే పాటలు ఇచ్చిన అనిరుద్, తన బీజీఎమ్ తో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది, ముఖ్యంగా రజినీని ఎలివేట్ చేస్తూ తీసిన సిలౌట్ షాట్స్ సూపర్ గా ఉన్నాయి, తెరపై ఒక కొత్త రజినీకాంత్ చూపించడానికి ఈ షాట్స్ బాగా హెల్ప్ అయ్యాయి. లైటింగ్ వర్క్, కలర్ ప్యాట్రన్ లాంటి టెక్నీకల్ అంశాలు టాప్ నాచ్ లో ఉంది. ఇక రజినీ ఫ్యాన్ గా ఈ సినిమాని తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్, ప్రతి ప్రేక్షకుడికి వింటేజ్ రజినీకాంత్ ని గుర్తు చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్రిప్పింగ్ గా, కాళీ లైఫ్ లో జరిగింది? అసలు అతనెవరు అనే క్యూరియాసిటీ కలిగించడంలో, దాన్ని అలాగే సస్టైన్ చేయడంలోనూ కార్తీక్ సుబ్బరాజ్ పూర్తిగా సక్సస్ అయ్యాడు. అయితే మొదటి భాగంలో అతను రజినీని ఎలివేట్ చేసిన విధానం చూసి కాళీ వెనక మరో బాషాకి ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనే ఆశతో సెకండ్ చూస్తే, డైరెక్టర్ పూర్తిగా నిరాశపరిచాడు. హీరో పాత్రని ఇంత లేపింది ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా కోసమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

కంబ్యాక్ మూవీ

ఫస్ట్ హాఫ్ చూసాక చాలా పెద్ద కథగా కనిపించిన పేట.. సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా రీజినల్ వాసనతో యూనివర్సల్ పాయింట్ లేక కంటెంట్ కుంచించుకు పోయింది, క్లైమాక్స్ 20 నిమిషాలు చివరలో వచ్చే ఒక ట్విస్ట్ తప్ప, సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేవు. కథ పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్లుగా ఉంది కాబట్టి ఇది తెలుగు సినీ అభిమానులని తప్పక నిరాశపరిచే విషయం. రజినీ చూపించడంలో, పాత తలైవాని గుర్తు చేయడంలో సక్సస్ అయిన కార్తీక్ సుబ్బరాజ్… కథపైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఈరోజు పేట రజినీకి తప్పకుండ కంబ్యాక్ మూవీ అయ్యేది, అలా అని పేట తీసేసే సినిమా కాదు.. ఇది కేవలం రజినీ సినిమా. అతన్ని వింటేజ్ రజినీగా చూపించే సినిమాలో, తలైవాలో ఇంకా స్టైల్ తగ్గలేదని నిరూపించే సినిమా. సింపుల్ గా చెప్పాలి అంటే పేట సినిమా చూడడానికి ఉన్న ఒకేఒక్క కారణం సూపర్ స్టార్ రజినీకాంత్. సో మొత్తానికి హిట్ కోసం ఎదురు చూస్తున్న రజినీకాంత్, తమిళనాట కాసుల వర్షం కురిపించగలదు కానీ తెలుగులో ఇంత పోటీ మధ్యలో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడం మాత్రం కష్టమే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *