200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఎన్నికలు

200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఎన్నికలు

తెలంగాణతో పాటు రాజస్థాన్‌లోనూ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయినా.. మద్యం, మనీ పంపకాల జోరు సాగుతోంది. శుక్రవారం జరగనున్న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా అధికార, ప్రతిపక్షాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Rajasthan Elections 2018

199 స్థానాలకు ఎన్నికలు

రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ప్రస్థుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 199 స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 4.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నరాజస్థాన్‌లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ఉండే అవకాశం ఉంది. 130 స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంది. కాగా 50 చోట్ల ఇరుపార్టీల నుంచి రెబల్స్ బరిలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.

ఐదేళ్ల కోసారి ప్రభుత్వాన్ని మార్చడం ఆనవాయితి

రాజస్థాన్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీల అగ్రనేతలంతా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ పాల్గొన్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు. ఇక రాజస్థాన్ సీఎం వసుంధర రాజే బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారనే చెప్పాలి. బీఎస్పీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ చీఫ్ మాయావతి ప్రచారం నిర్వహించారు.

ఈ సారి ఎన్నికల్లో గెలుపెవరిదనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాజస్థాన్ ప్రజలు ప్రతి ఐదేళ్ల కోసారి ప్రభుత్వాన్ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. 2008లో కాంగ్రెస్‌ని గెలిపించిన ప్రజలు 2013 బీజేపీకి పట్టంగట్టారు. 2013లో బీజేపీ 163 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 21 స్థానాలు దక్కించుకుంది. మరో 16స్థానాలు ఇతరులు గెలుచుకున్నారు. కాగా ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయా అనే అసక్తి అందరిలోనూ నెలకొంది.

డిసెంబరు 11న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడవుతాయి. ఆనవాయితి ప్రకారం.. ప్రజలు కాంగ్రెస్‌కి పట్టగడతారా? లేదా.. మళ్లీ బీజేపీనే అధికారాన్ని నిలుపుకుంటుందా వేచిచూడాల్సిన విషయం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *