క‌ల్కి ట్విటర్ టాక్!

క‌ల్కి ట్విటర్ టాక్!

రెండేళ్ల క్రితం పీఎస్వీ గ‌రుడవేగ సినిమాతో చాలా కాలానికి హిట్ కొట్టిన రాజ‌శేఖ‌ర్.. మ‌ళ్లీ ఇప్పుడు క‌ల్కి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీతో సాగుతుందని ట్రైలర్‌లో చెప్పేశారు. శుక్రవారం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. యుఎస్‌లో ఒక‌రోజు ముందుగానే విడుద‌లవడంతో అక్క‌డ ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలను చూసిన ప్రేక్షకులు సినిమా చాలా బాగుందని ట్విటర్‌లో కూసేస్తున్నారు. క‌ల్కి..ఆస‌క్తిక‌రంగా సాగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అని చెబుతున్నారు. రాజ‌శేఖ‌ర్ చాలా అద్భుతంగా న‌టించాడంటున్నారు ప్రేక్ష‌కులు.

ముఖ్యంగా గ‌రుడ‌వేగ ఇచ్చిన హిట్ కారణమో ఏమో కానీ క‌ల్కిలో చాలా స‌న్నివేశాల్లో దశాద్బం క్రిత్మ డైనమిక్ రాజ‌శేఖ‌ర్ క‌నిపించాడంటున్నారు ఫ్యాన్స్. గరుడవేగతో ప్ర‌శంస‌ల ద‌గ్గ‌రే ఆగిపోయిన రాజశేఖర్.. ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ హిట్ కూడా కొడ‌తాడ‌ని ధీమాగా చెబుతున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. అయితే కొందరి నుంచి కొంత విముఖత కూడా ఎదురైంది. కథ చెప్పడంలో స్లో నెరేష‌న్ ఒక్క‌టే క‌ల్కికి స‌మ‌స్య‌గా మారిపోయిందంటున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ తన గత చిత్రం ‘అ..!’ లాగానే ఇందులో కూడా ట్విస్టులు బాగానే పెట్టాడ‌ని.. అవి ప్రేక్ష‌కుల‌ను కూడా బాగానే అల‌రిస్తాయంటున్నారు యుఎస్ ఆడియ‌న్స్. ప్రీమియ‌ర్ షో టాక్ చూసిన త‌ర్వాత వస్తున్న రివ్యూల ప్రకారం రాజ‌శేఖ‌ర్ మళ్లీ హిట్ కొట్టేశాడని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *